చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థుల దెబ్బ: అట్టుడికిన తమిళనాడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అమ్మ బతికి ఉంటే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: నీట్ రూపంలో విగతజీవిగా మారిన దళిత విద్యార్థి అనిత కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని సోమవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శశికళ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేస్తామని 8 మంది మంత్రులు వార్నింగ్?శశికళ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేస్తామని 8 మంది మంత్రులు వార్నింగ్?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పేదలకు న్యాయం చేస్తామని, జయలలిత ఆశయాలను నెరవేర్చుతామని తమిళనాడు ప్రభుత్వం గొప్పలు చెబుతోందని విమర్శించారు.

Chennai Kovai protests students over Anithas suicide

నీట్ ను జయలలిత బహిరంగంగానే ఎన్నో సార్లు వ్యతిరేకించారని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కేంద్ర ప్రభుత్వానికి పదేపదే చెప్పారని గుర్తు చేశారు. జయలలిత వ్యతిరేకించిన నీట్ నుంచి తమిళనాడు మినహాయించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం చేసిందని మండిపడ్డారు.

తమిళనాడు సెక్రటేరియట్ ముట్టడి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన విద్యార్థులు!తమిళనాడు సెక్రటేరియట్ ముట్టడి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన విద్యార్థులు!

వారి పదవులు కాపాడుకోవడానికి, గ్రూపు రాజకీయాలు చెయ్యడానికి తమిళనాడు సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లారని, నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి ఉంటే పేదింటి బాలిక అనిత ప్రాణం నిలబడి ఉండేదని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. చెన్నై నగరంతో పాటు కోయంబత్తూరు, మదురై, సేలం, వేలూరు తో సహ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిన వేలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
In Coimbatore students have protest asking that NEET be scrapped.Police arrested many students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X