చాక్లెట్లు, బిస్కెట్లు తినే కోతి 38 మందిని కరిచింది
చెన్నై: డ్రగ్స్‌కు బానిసైన మనిషి ఆ డ్రగ్స్ దొరక్కపోతే ఎటువంటి పిచ్చిపనులు చేస్తాడో మనకు తెలిసిందే. సరిగ్గా ఇలానే ఓ కోతి చాక్‌లెట్లకు బానిసై చాక్లెట్లు ఇవ్వకపోవడంతో 38 మందిని కరిచింది. ఈ సంఘటన దక్షిణ చెన్నైలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దక్షిణ చెన్నైలోని సెంబాక్కం ప్రాంతంలో తిరుగుతున్న ఓ కోతికి అక్కడి చిన్నారులు చాక్లెట్లు, బిస్కెట్లు ఆహారంగా అందించేవారు. అలా చాక్లెట్లు, బిస్కెట్లు తినడానికే అలవాటుపడిన ఆ కోతి అరటిపండును తినడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు.
ఒకరోజు ఓ స్కూలు విద్యార్ధిని ఆహారం కోసం అ కోతి వెంబడించింది. ఎప్పూడు చాక్లెట్లు, బిస్కెట్లు తినే ఆ కోతికి ఆ బాలుడు అరటిపండును నోటికి అందించాడు. అయితే అరటిపండుని తినడానికి ఏ మాత్రం ఇష్టపడని ఆ కోతి ఆ బాలుడుని కరిచింది.

తన వద్ద ఉన్న బిస్కెట్ ప్యాకెట్‌ను లాక్కొని పారిపోయింది. ఇలా ఆహారం కోసం కోతికి అరటిపండు పెట్టే వారిని కోతి కరవడం మొదలు పెట్టింది. ఇలా దక్షిణ చెన్నైలోని సుమారు 38 మందిని కరిచింది. ఇందులో 25 మంది స్కూలు విద్యార్ధులు ఉండటమే విశేషం.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు, వాలంటీర్లు నాలుగు రోజులు పాటు ఆ కోతిని వెంబడించి పట్టుకుని, వాండ్లర్ జూకు తరలించారు. ఈ సందర్భంలో కోతులు లాంటి జంతువులకు మనుషులు ఆహారాన్ని అందించడాన్ని వారు తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications