బీ అలెర్ట్.. పిల్లలు ఫోన్​లో గేమ్​ ఆడితే పేరెంట్స్ కు రూ.5000 జరిమానా

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ లలో మునిగిపోతున్నారు. ఇన్నాళ్లు పిల్లలు టైమ్ దొరికితే బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకునేవారు. కానీ నేటి సమాజంలో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ స్టార్మ్ ఫోన్ ఉండాల్సిందే. దీంతో పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడ్డారు. ఫోన్ లో పాటలు, గేమ్స్ పెడితేనే అన్నం తినే పిల్లల్ని మనం రోజూ చూస్తుంటాం. ఇక 8,9 తరగతుల దగ్గర్నుంచే కొంతమంది విద్యార్థులు మొబైల్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్ని స్మార్ట్ ఫోన్ వినియోగం నుంచి దూరం జరిపేందుకు ఆ గ్రామం కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఫోన్ లో గేమ్స్ ఆడితే తల్లిదండ్రులకు రూ. 5వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ ఊరి పెద్దలు తీర్మానం చేశారు. వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ ఊరు ఎక్కడుందో తెలుసా..?

సాధారణంగా రోడ్డుపై ఉమ్మి వేస్తేనే.. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, సిగరెట్ తాగినా ఫైన్ వేస్తుంటారు. కానీ తొలిసారిగా పిల్లలు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడితే తల్లిదండ్రులకు ఫైన్ వేయడం ఎప్పుడైనా విన్నారా..? కానీ ఇది నిజం. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామం ఈ వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టింది. పిల్లలు ఎవరైనా స్మార్ట్ ఫోన్ లో డేంజరస్ గేమ్స్ అయిన పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడితే వారి తల్లిదండ్రులకు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ ఊరి పెద్దలు. రాజ్ నంద్ గావ్ ​ జిల్లా ఛురియా బ్లాక్​ లోని గహీరాభేడీ గ్రామ పంచాయతీ పెద్దలు ఈ తీర్మానం చేశారు. మొబైల్​ లో గేమ్ ఆడే పిల్లలను కట్టడి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Chhattisgarh Village Fines Parents 5000 for Kids Phone Gaming

గహీరాభేడీ గ్రామంలోని చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ.. సమయం వృథా చేసుకోవడంతో పాటు శారీరక కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం లాంటివి ఆ ఊరి పెద్దలు గమనించారు. పిల్లలు ఫోన్ వ్యసనానికి గురైనట్లు గ్రహించారు. పిల్లులు ఫోన్ లకు బానిసలు కావడంలో చిన్నారుల పాత్ర ఎంత ఉందో.. వారి తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉందని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పిల్లలు మొబైల్​ కు బానిసలుగా మారకుండా ఆపేందుకు జరిమానా విధించాలని గ్రామ పెద్దలంతా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని గహీరాభేడీ గ్రామ సర్పంచ్​ బెద్ బాయి పోర్టే తెలిపారు. అలాగే పిల్లలు గేమ్స్ ఆడుతున్న సమాచారాన్ని తెలిపితే రూ. 1000 ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+