శ్రీవల్లి పాటతో ఏడుపు ఆపిన చిన్నారి.. వీడియో వైరల్
ఇటీవల వచ్చిన పుష్ప మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటన.. మ్యానరిజం యువతనే కాదు పిల్లలను కూడా అట్రాక్ట్ చేస్తోంది. అవును పాట, ఆటలు పసి పిల్లల ఏడుపు మానివేస్తోంది. ఇదీ నిజమే.. మూవీలోని శ్రీ వల్లి సాంగ్‌కు మాములు క్రేజ్ లేదు. అన్నీ భాషల్లో ఆ పాట ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాలోని మిగతా పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.
అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. షాదాబ్ అలీ ఖాన్ అనే ఓ నెటిజన్ సైతం శ్రీవల్లీ సాంగ్ హుక్ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న పాపాయిని జో కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. పాపను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి స్టెప్ పర్‌ఫెక్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఒరిజినల్ శ్రీవల్లీ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సాంగ్ 80 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తెలుగులో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా, హిందీ వెర్షన్‌లో జావేద్ అలీ పాడారు.

పుష్ప మూవీ థియేటర్లలో.. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ దూసుకెళ్తుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన క్రేజ్ తగ్గడం లేదు. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖండ తర్వాత పుష్ప మంచి క్రేజీ వచ్చింది. తర్వాత ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్.. కరోనా కేసుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అయితే పుష్ప తగ్గేదీ లేదనే డైలాగ్ సార్థకం చేసుకుంటుంది.
పుష్ప రెండు పార్టులుగా వస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప ద రైజ్ పార్ట్ 1 కాగా.. పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్.. అందులో ఎస్పీతో పుష్ప గొడవ.. సునీల్, మిగతా వారి పగ, ప్రతీకారం ఉంటాయి. పార్ట్-1 ఇచ్చిన హైప్.. పార్ట్-2లో ఎక్కువే ఉంది. రెండు పార్టులు కలిసి.. అల్లు అర్జున్ కెరీర్ నిలబెట్టాయనడంలో సందేహామే లేదు.












Click it and Unblock the Notifications