ఏం చెప్పినా: డిగ్గీకి చిరు హామీ, కలిసిన కొండా సురేఖ

డిగ్గీ తెలంగాణ ప్రాంత మంత్రులు, చిరంజీవి, ఇతర నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. భవిష్యత్తు వ్యూహాలను చిరు ముందు ఉంచారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తాను పార్టీ భవిష్యత్తు కోసం ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరిస్తానని, పార్టీ కోసం ఏమైనా చేస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
డిగ్గీతో కొండా దంపతులు
దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ ప్రాంత వరంగల్ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర రావులు భేటీ అయ్యారు.
కాపు కాస్తున్న కాంగ్రెస్
కాపు సామాజికవర్గాన్ని తనపైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మొదటినుండి ప్రధానంగా రెడ్డి, కాపు సామాజిక వర్గాలపై ఆదారపడున్న సంగతి తెలిసిందే. అయితే కాపు సామాజిక వర్గాన్ని మరింత ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర పరిస్ధితులలో రాష్ట్రపతి పాలనకన్నా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిస్తునట్లు సమాచారం.
పిసిసి ఛీఫ్ బొత్సా సత్యనారాయణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని అధిష్టాననికి సూచించినట్లు తెలుస్తుంది. నాలుగున్నారేళ్ళు పాలించి చివరిలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగోదని పలువురు సీనియర్ నేతలు కూడా అధిష్టానానికి సూచించారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి గాలం వేసేందుకు కొత్త ముఖ్యమంత్రిపై హైకమాండ్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి రేసులో చిరంజీవి మందున్నారు. మరోపక్క అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సా, కన్నా లక్ష్మీ నారాయణ చిరంజీవికి గట్టి పోటీ ఇస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సిఎం చేయడం ద్వారా రానున్న ఎన్నికలలో సీమాంధ్రలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును కొల్లగొట్టొచ్చని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బిసిల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications