College girl: నిశ్చితార్థం అయ్యింది, ప్రియుడితో కాలేజ్ అమ్మాయి ఎస్కేప్, తల్లిదండ్రులు ?
చెన్నై/కడలూరు: దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఉద్యోగం చేస్తుంటే కుమార్తె కాలేజ్ లో చదువుతోంది. డిగ్రీ చదువుతున్న అమ్మాయికి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవల ఓ యువకుడితో కాలేజ్ అమ్మాయి పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే ఉదయం అమ్మాయి కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి ఆమె ప్రియుడితో పరారైయ్యింది. కాబోయే భర్త ఆమె ప్రియుడితో లేచిపోయిందని తెలుసుకున్న పెళ్లి కొడుకు అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాలేజ్ అమ్మాయి ఇంటిలో ఇద్దరు శవాలై కనిపిచండం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం సమీపంలోని వేలంగిపట్టు గ్రామంలో సుందరమూర్తి, సుమతి దంపతులు నివాసం ఉంటున్నారు. సుందరమూర్తి, సుమతి దంపతులకు చంద్రశేఖరన్ అనే కుమారుడు, రోహిణి (20) అనే కుమార్తె ఉన్నారు. చంద్రశేఖరన్ ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సి మడ్లూరులోని కాలేజ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.

కాలేజ్ అమ్మాయి పెళ్లి ఫిక్స్
రోహిణికి పెళ్లి చెయ్యాలని ఆమె తండ్రి సుందరమూర్తి కొన్ని పెళ్లి సబంధాలు చూశారు. ఇదే నెల 12వ తేదీన పెరియాండికుజి గ్రామంలో నివాసం ఉంటున్న రాజేష్ (25) అనే యువకుడితో కాలేజ్ అమ్మాయి రోహిణి పెళ్లి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి రోహిణి బంధువులు, రాజేష్ బంధువులు, స్నేహితులు హాజరైనారు.

ప్రియుడితో లేచిపోయిన అమ్మాయి.... తల్లిదండ్రుల ఆత్మహత్య
ఎప్పటిలాగే గురువారం ఉదయం రోహిణి కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ కు వెళ్లిన రోహిణి రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. రోహిణి వేలంగిపట్టి గ్రామంలో నివాసం ఉంటున్న ప్రియుడు బాల్ రాజ్ (24) పారిపోయిందని ఆమె తల్లిదండ్రులు సుందరమూర్తి, సుమతి దంపతులకు తెలిసింది. కూతురు లేచిపోవడంతో సుందరమూర్తి, సుమతి దంపతులు అవమానం తట్టుకోలేకపోయారు.

అవమానంతో ఆత్మహత్య
ఇదే సమయంలో రోహిణితో నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భర్త రాజేష్ ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి అసహనం వ్యక్తం చేశాడు. అవమానంతో అర్దరాత్రి ఊరి బయట ఉన్న శేఖర్ అనే వ్యక్తి పొలంలోకి వెళ్లిన సుందరమూర్తి, ఆయన భార్య సుమతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కాలేజ్ అమ్మాయి మొబైల్ ఫోన్ ?
శుక్రవారం కొడుకు చంద్రశేఖరన్ తల్లిదండ్రులు సుందరమూర్తి, సుమతి కోసం వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ప్రియుడు బాల్ రాజ్ తో పారిపోయిన కాలేజ్ అమ్మాయి రోహిణి ఆమె మొబైల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకుందని, అవమానంతో ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications