Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల ఫలితాల రోజే పెట్రో ధరలు పెరుగుతాయట.. బీజేపీపై కాంగ్రెస్ బాంబ్..!

Recommended Video

    ఎన్నికల ఫలితాల రోజే పెట్రో ధరలు పెరుగుతాయట..!! || Oneindia Telugu

    ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల వేళ ఆరోపణాస్త్రాలు జోరందుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల తీరుగా సాగుతున్న మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా మాటల మంటలు రేపుతున్న కాంగ్రెస్ నేతలు తాజాగా పెట్రో ధరల పెంపుపై పేల్చిన బాంబ్ చర్చానీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చే 23వ తేదీ సాయంత్రమే పెట్రో ధరలు పెరగనున్నాయనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టడంతో పెట్రో మంట భగ్గుమంటోంది.

    పెట్రో ధరలకు రెక్కలు..!

    పెట్రో ధరలకు రెక్కలు..!

    పెట్రో ధరల పెంపుపై రణదీప్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లీటర్ పెట్రో ధరలు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగే ఛాన్సుందని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చే రోజే పెట్రో ధరలు అమల్లోకి వస్తాయనే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు ముహుర్తం ఖరారు చేశారని, ఆ విషయం ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారని రణదీప్ సూర్జేవాలా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు.

    బీజేపీపై దండెత్తిన కాంగ్రెస్

    బీజేపీపై దండెత్తిన కాంగ్రెస్

    ఎన్నికల వేళ పెట్రో ధరలు పెంచితే బీజేపీకి ఓట్లు రాలవనే కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ తగు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు సూర్జేవాలా. ఫలితాలు వచ్చే రోజు వరకు పెట్రో ధరలు పెంచొద్దని ఆయిల్ కంపెనీలను మోడీ ఆదేశించారని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతూ పెట్రో ఆంక్షలు, ధరల పెరుగుదలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పక్కా ప్రణాళికతో మే 23వ తేదీ వరకు పెట్రో ధరలు పెరగకుండా నియంత్రించారని మండిపడ్డారు.

    అమెరికా ఆంక్షలు.. భారత్ లో ఎఫెక్ట్

    అమెరికా ఆంక్షలు.. భారత్ లో ఎఫెక్ట్


    అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలతో ముడి చమురు దిగుమతిపై ఆంక్షలు నెలకొన్నాయి. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవద్దని సూచించడంతో భారత్ తో పాటు చాలా దేశాలకు ఎఫెక్ట్ కానుంది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరుతో ముడి చమురు దిగుమతి కష్టతరం కానుంది. అమెరికా ఆంక్షలకు భారత్ ఓకే చెప్పడంతో.. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.

    ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి ఆగిపోతే గనక పెట్రో ధరలు భారం కానున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటాయి. దీని కారణంగా భారత్ లోనూ పెట్రో ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+