మా సీఎం వెంట్రుక కూడా పీకలేరు, కేంద్రంలోని నాయకులకు సిట్టింగ్ ఎమ్మెల్యే సవాల్
కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ఇరికించేందుకు ఈడీ, కేంద్రంలోని బీజేపీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారని, మా సీఎం సిద్ధరామయ్యను కేసులో ఇరికించడం కాదుకదా, ఆయన ఒక్క వెంట్రుక కూడా పీకలేరని చిక్కబళ్లాపురం (అనంతపురం జిల్లా సరిహద్దు) అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కర్ణాటక రాష్ట్రం పరువు తీస్తున్నారని, ఈ కేసులో కల్లేశ్‌ను ఈడీ విచారణకు పిలిచిందని, ఈ కేసులో సీఎం సిద్దరామయ్య పేరు చెప్పాలంటూ ఈడీ అధికారులు అతని మీద ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఆరోపించారు. మా సీఎం సిద్ధరామయ్యను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని, ఆయన వెంట్రుకను కూడా కేంద్రం నేతలు పీకలేరని చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ మండిపడ్డారు.

బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రదీప్ ఈశ్వర్ ఈ కేసులో కల్లేశ్‌కు అధికారులు అనేక ప్రశ్నలు వేశారని ఆరోపించారు. మనోజ్ మిట్టల్, కన్నన్ అనే ఇద్దరు ఈడీ అధికారులు సీఎం సిద్దరామయ్య పేరు చెప్పాలని కల్లేశ్ మీద ఒత్తిడి తెచ్చారని, లేని పక్షంలో నీకు శిక్ష తప్పదని అతన్ని బెదిరించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఆరోపించారు.
దీంతో ఈడీ అధికారులపై బెంగళూరులోని విల్సన్ గార్డెన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, వెనుకబడిన తరగతుల నాయకుడిపై కేంద్రంలోని నేతలు ఇలా చేస్తున్నారని, ప్రదీప్ ఈశ్వర్ ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా సీఎం సిద్ధరామయ్య వెంట్రుక కూడా పీక్కోలేరని కేంద్ర నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సవాల్ విసిరారు.
కర్ణాటక వాల్మీకి కార్పొరేష్ స్కామ్ కేసులో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాలో, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఈడీ, సిట్ అధికారులు దర్యాప్తు చేసి కోట్లాది రుపాయల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకతో పాటు హైదరాబాద్ లో కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ, కర్ణాటక సిట్ అధికారులు కీలకసమాచారం సేకరించారు. ఇదే స్కామ్ కేసులో మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి. నాగేంద్ర తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు.












Click it and Unblock the Notifications