వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద మృతి: రిజైన్‌కు సిద్దపడ్డ థరూర్, అధిష్టానం నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress says Shashi Tharoor inseparable, will not quit
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నుంచి మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశి థరూర్‌ను తొలగించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణ సజావుగా సాగేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ఎన్సీపి నేత డిపి త్రిపాఠీ డిమాండ్ చేశారు.

ఎన్సీపి, ఇతరుల డిమాండ్ నేపథ్యంలో శశి థరూర్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయవద్దనే ఉద్దేశ్యంతో థరూర్ రాజీనామా చేసేందుకు సిద్ధమని అధిష్టానానికి చెప్పారట. అయితే, అధిష్టానం మాత్రం అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

శశిథరూర్ రాజీనామా చేయాలన్నది త్రిపాఠీ వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సర్జేవాలా బుధవారం మీడియాతో అన్నారు. బాధ్యత కలిగిన హోదాలో ఉన్న శశి థరూర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. సునంద మృతి విషయంలో శశి థరూర్‌పై ఇంతవరకూ ఎవరూ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

సునంద మరణంపై విచారణ ముగిసే వరకూ అధికార బాధ్యతలకు దూరంగా ఉండాలని థరూర్ భావించవచ్చని, అయితే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలనడం సహేతుకం కాదన్నారు. థరూర్ రాజీనామా చేయాలని బిజెపి కేరళ విభాగం డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కారణాలుండవచ్చన్నారు. సునంద మృతిపై వేగవంతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను బహిర్గతం చేయాలని సాక్షాత్తూ శశి థరూర్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని చెప్పారు.

English summary
Congress came out in defence of Shashi Tharoor on Wednesday saying there is "no question" of his resignation and virtually snubbed its ally NCP which had said he must dissociate himself from his ministerial duties till probe into the death of his wife Sunanda Pushkar is over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X