చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ఇద్దరు మహిళా ఎస్ఐలకు ఆ సంబంధం ఉంది !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇద్దరు మహిళా ఎస్ఐలు పరిధి దాటి సంబంధం పెట్టుకోవడంతో ఓ మహిళా ఎస్ఐ భర్త జీవితంపై విరక్తి చెంది విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చెన్నై నగరంలో జరిగింది.

చెన్నైలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న అరివఝగన్ (35) విషం సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. చెన్నై పోలీసు అధికారుల కథనం మేరకు అరిఝవన్, మహిళా ఎస్ఐని వివాహం చేసుకున్నాడు.

ఆ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ అరివఝగన్ చెన్నైలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే మరో మహిళా ఎస్ఐ ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య, మరో మహిళా ఎస్ఐ ఇద్దరూ పరిధి దాటి సంబంధం సాగిస్తున్నారని అరివఝగన్ కు గుర్తించాడు.

Cop attempts suicide over wife’s friendship with woman SI in Chennai

అంతే కాకుండా తనకు విడాకులు ఇవ్వాలని అతని భార్య (మహిళా ఎస్ఐ) ఒత్తిడి చేసింది. అరివఝగన్ వెళ్లి ఎందుకు తన భార్యతో ఇలా ప్రవర్థిస్తున్నావని మహిళా ఎస్ఐని నిలదీశాడు.

ఆ సందర్బంలో ఆ మహిళా ఎస్ఐ తనను అందరి ముందు తీవ్రస్థాయిలో అవమానించిందని, తనను చెప్పుతో కొట్టి నీ భార్యకు దూరంగా ఉండాలని బెదిరించిందని ఆరోపిస్తూ అరివఝవన్ ఆత్మాహత్యాయత్నం చేశాడు.

ఇదే విషయం ఆసుపత్రిలో పై అధికారులకు చెప్పాడు. తన భార్య, మహిళా ఎస్ఐ గురించి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో నీచంగా మాట్లాడుకుంటున్నారని, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశానని అరివఝగన్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

మహిళా ఎస్ఐలు ఇద్దరూ ఒకే బ్యాచ్ కు చెందిన వారని మొదటి నుంచి స్నేహితులని, చివరికి ఇలా అయ్యిందని పై అధికారుల దగ్గర వాపోయాడు. అరివఝవన్ భార్య (మహిళా ఎస్ఐ)ని పోలీసు అధికారులు విచారించారు.

అయితే ఎస్ ఐ అని చూడకుండా కానిస్టేబుల్ అరివఝవన్ తనను పురుషపదజాలంతో దూషించాడని మహిళా ఎస్ఐ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎస్ఐ, అరివఝవన్ ఇద్దరూ ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Arivazhagan in his statement told senior police officers that both women sub-inspectors belonged to same batch and were close friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X