రిపబ్లిక్ డే ఉత్సవాల్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య, ఎందుకంటే?
లూథియానా: 44 ఏళ్ళ పోలీస్ కానిస్టేబుల్ రిపబ్లిక్ డే ఉత్సవాల్లోనే ఏకే 47 తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు 45 కిలోమీటర్ల దూరంలోని జాగ్రాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం నాడు చోటు చేసుకొంది.
చనిపోయిన కానిస్టేబుల్‌ను మంజిత్ సింగ్‌గా గుర్తించారు. జాగ్రాన్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హౌజ్ ఆఫీసర్‌కు మంజిత్ సింగ్‌ను గన్‌మెన్‌గా డిప్యూటేషన్‌పై పంపారు.

కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ మంజిత్ సింగ్ నిరాశా, నిస్పృహలకు గురయ్యారని పోలీసులు చెప్పారు.ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరో వైపు మృతదేహన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications