బీజేపీ ఎంపీకి ఐసిస్ నుండి చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు తరుణ్ విజయ్‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో, ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
తనకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తరుణ్ విజయ్ చెప్పారు. కాశ్మీర్, జీహాదీ పైన తాను రాసిన వాటికి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపుల పైన అతను కేంద్ర హోంశాఖమంత్రికి, ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి ఫిర్యాదు చేశారు.

బీజేపీ ఎంపీకి వచ్చిన బెదిరింపుల పైన విచారణ చేయాలని బీఎస్ బస్సీ సైబర్ సెల్ విచారణ అధికారులను ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా ఆ బెదిరింపు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంపీ తరుణ్ విజయ్ తన ఫిర్యాదు లేఖలో.. పదిహేను రోజుల్లో తన ఈ మెయిల్ రెండుసార్లు హ్యాకింగ్‌కు గురయిందని చెప్పారు. తనకు ఇస్లామిక్ స్టేట్ నుండి బెదిరింపు వచ్చిందని, అయితే దానిని తాను పట్టించుకోలేదని, ఆ మెయిల్ తొలగించానని చెప్పారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications