Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

COVID-19: 1,400 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా ? లేదా ?, ప్రధానికి బీజేపీ సీఎం మనవి. లేదంటే !

చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అత్యవసర వైద్యసేవలకు ఆక్సిజన్ చాలా అవసరం ఉందని, వెంటనే మాకు 1,471 టన్నుల ఆక్సిజన్ పంపించి ఆదుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని వేడుకోవడంతో దేశంలో ఆక్సిజన్ అవసరం ఎంత ఉందో ? అనే విషయం మనకు అర్థం అవుతోంది. సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

 అలా అయితే మూసేయాలి అంతే ?

అలా అయితే మూసేయాలి అంతే ?

రాబోయే 10 రోజుల్లో కర్ణాటకలో ఆక్సిజన్ తో పాటు రెమిడిసివిర్ ఔషదాల కొరత తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది., తమకు సరైన సమయంలో ఆక్సిజన్ రెమిడిసివిర్ టీకాలు, ఔషదాలు అందకపోతే అత్యవసర వైద్యసేవలు మూసివేసే పరిస్థితి ఎదురైయ్యిందని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారని తెలిసింది.

 1,471 టన్నుల ఆక్సిజన్ కావాలి

1,471 టన్నుల ఆక్సిజన్ కావాలి

కర్ణాటకకు ప్రతిరోజు 1,471 టన్నుల ఆక్సిజన్ తో పాటు రెండు లక్షల రెమిడిసివిర్ డోసుల టీకాలు సరఫరా చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. దేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మనవి చేశారని తెలిసింది.

 కేంద్రం ఇచ్చింది ఎంతంటే ?

కేంద్రం ఇచ్చింది ఎంతంటే ?

గురువారం కర్ణాటక రాష్ట్రంలో 500 టన్ను ఆక్సిజన్ ఉపమోగించామని, కాని కేంద్ర ప్రభుత్వం కేవలం 300 టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేసిందని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ఎత్తి చూపించారని తెలిసింది. ఏప్రిల్ 25వ తేదీ పరిస్థితులను బట్టి కర్ణాటకకు 1,142 టన్నలు ఆక్సిజన్ అవసరం అవుతుందని, ఏప్రిల్ 30వ తేదీ నాటికి 1, 471 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ముందు వివరించారని తెలిసింది

 మీ చేతుల్లోనే ఉంది

మీ చేతుల్లోనే ఉంది

కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఆక్సిజన్, రెమిడిసివిర్ టీకాలు సరఫరా చెయ్యకపోతే తాము కోవిడ్ 19 అత్యవసర వైద్య సేవలు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని సీఎం యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారని సమాచారం. మొత్తం మీద దేశంలో కరోనా తాండవం చేస్తున్న 10 ప్రధాన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా కారణంగా ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఆయన గోడు వినిపించడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+