బెంగళూరు గొడవలు: డీజీపీ, కమిషనర్ కు సిద్దు క్లాస్
బెంగళూరు: బెంగళూరు నగరంలో గొడవలు జరగకుండా చూడటంతో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారని తెలిసింది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం బెంగళూరులో గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
బెంగళూరులో జరిగిన హింసను అరికట్టడంలో రాష్ట్ర డీజీపీ ఓంప్రకాష్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరికర్ విఫలం అయ్యారని సీఎం సిద్దరామయ్య ఫుల్ క్లాస్ ఇచ్చారని ఉన్నతస్థాయి అధికారులు అంటున్నారు.

బెంగళూరు నగరంలో గొడవలు జరుగుతాయని మీరు ఎందుకు గుర్తించలేదని, గొడవలు తారాస్థాయికి చేరినా ఎందుకు వాటిని అడ్డుకోలేదని ప్రశ్నించారని తెలిసింది. బెంగళూరులో హింస చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడ్డారని తెలిసింది.
కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేసిన తరువాత గొడవలు జరుగుతాయని అందరికి తెలిసిన విషయమే. అయితే బెంగళూరు నగరంతో పాటు మండ్య, మైసూరు జిల్లాల్లో గొడవలు అరికట్టడంలో పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications