Biparjoy:అరేబియా సముద్రంలో పెను తుఫాన్- తీరం వైపు: భారీ వర్షాలు

పనాజి: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. తీవ్ర రూపాన్ని దాల్చింది. మరి కొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా పెను తుఫాన్‌గా మారడానికి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో అరేబియా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు పడుతున్నాయి. కేరళలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.

అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం గగనతలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. వాతావరణం కేంద్రం అంచనాలకు అనుగుణంగా ఇది అల్పపీడనంగా మారింది. మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉత్తరం వైపునకు తన దిశను మార్చుకుంది. ఈ మధ్యాహ్నానికి అరేబియా సముద్రం తూర్పు మధ్య భాగంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.

Cyclone Biparjoy

బుధవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో గోవా తీరానికి పశ్చిమ- నైరుతి దశలో 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ముంబైకి నైరుతి దిశలో 970, గుజరాత్‌లోని పోర్బందర తీరానికి 1,050 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు అయిదు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ తీరం వైపు కదులుతోంది. గుజరాత్ వైపు కదులుతున్నట్లు నిర్ధారించారు.

మరో 24 గంటల వ్యవధిలో ఇది తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని, ఈ నెల 10వ తేదీ నాటికి తీరాని తాకొచ్చని అంచనా వేసింది. గుజరాత్ వద్ద తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న ప్రస్తుత దశలో తుఫాన్ ఏర్పడటం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారిందని సూచించింది. అయిదు రోజుల పాటు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది.

Cyclone Biparjoy

రుతు పవనాల ఆగమన ప్రభావం అప్పుడే మొదలైంది కూడా. రాజధాని తిరువనంతపురం సహా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఏకధాటిగా తిరువనంతపురంలో వర్షం పడుతోంది. కన్నూర్ జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వచ్చే 48 గంటల్లో వర్షాల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+