అక్కాచెల్లెళ్ల గ్యాంగ్ రేప్, చెట్టుకు ఉరి: మరొకరి అరెస్టు

బాదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిపి, వారిని చెట్టుకు ఉరేసిన కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు గురువారం వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తేలింది.

దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం కేసులో అవధేశ్, యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటిండెంట్ అతుల్ కుమార్ సక్సేనా పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు..

 Dalit sisters' rape: One more accused arrested

ఏడుగురు నిందితుల్లో ఇది వరకు సర్వేష్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను, పప్పును అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సర్వేష్, పప్పులను గురువారంనాడు అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పరారీలో ఉన్నవారిలో పప్పు, అవధేష్ సోదరుడు ఉర్వేష్ యాదవ్, పోలీసు కానిస్టేబుల్ ఛత్రపాల్ యాదవ్ ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు ఎవరనేది తెలియడం లేదు. మే 27వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిల శవాలు ఉషాయిత్ వద్ద చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. అత్యాచారం చేసి వారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+