వైరల్ వీడియో: అద్భుతం.. చితి నుంచి లేచి కూర్చున్న బామ్మ

అవును చనిపోయిన బామ్మ బతికింది.. అద్భుతం జరిగింది. చితిపై నుంచి లేచి కూర్చొంది. గతంలో తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వృద్ధురాలు చితిపై నుంచి లేచి నీళ్లు అడిగిన ఘటన వైరల్ గా మారింది. అయితే తాజాగా ఒడిశాలోని పూరిలో ఇలాంటి ఘటనే జరిగింది. చనిపోయిందని భావించి అంత్యక్రియలు చేస్తుండగా ఆ బామ్మ చితిపై నుంచి లేచి కూర్చుంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు చితి నుంచి లేవడం చూసి అక్కడి ప్రజలు షాక్ అయ్యారు.

ఒడిశాలోని పూరీలో షాకింగ్ ఘటన జరిగింది. చనిపోయిన ఓ బామ్మ చితిపై నుంచి లేచి కూర్చుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన పి. లక్ష్మీ(86)ఒడిశాలోని గంజాం జిల్లా పొల్సారా ప్రాంతంలో ఉన్న తన అల్లుడి ఇంటికి వచ్చింది. అయితే అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె మృతి చెందినట్లుగా భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం పూరీలోని గణత్ద్వార్‌ కు తీసుకెళ్లారు.

Dead Woman Sits Up on Funeral Pyre in Puri Odisha Shocking Mourners

అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె బతికే ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించింది. వృద్ధురాలు లేచి కూర్చోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమెను వెంటనే చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా పూరీ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై గణత్ద్వార్‌ వాటిక సిబ్బంది మాట్లాడుతూ.. తాము ఏ మృతదేహానికైనా చనిపోయినట్లు వైద్యుడి నుంచి డిక్లరేషన్ పొందిన తర్వాతే దహనసంస్కారాలు చేస్తాం.. కానీ లక్ష్మి కుటుంబ సభ్యులు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. అందుకే ఆమెను వెంటనే దహనం చేయలేదు. ఈలోపు మృతురాలు లేచి కూర్చుంది అని తెలిపారు. లక్ష్మి కుటుంబ సభ్యులు, సిబ్బంది కలిసి ఆమెను పూరీలోని ఆస్పత్రిలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+