Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టైమ్స్ నౌ, అర్నబ్ గోస్వామి మీద పరువునష్టం దావా వేసిన కర్ణాటక మంత్రి, డీకే రవి కేసులో !

ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ మీడియా మీద కర్ణాటక మంత్రి కేజే. జార్జ్ పరువునష్టం దావా వేశారు. ఐఏఎస్ అధికారి డీకే. రవి మృతికి సంబంధించిన కేసులో తన మీద లేనిపోని ఆరో

బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ మీడియా మీద కర్ణాటక మంత్రి కేజే. జార్జ్ పరువునష్టం దావా వేశారు. ఐఏఎస్ అధికారి డీకే. రవి మృతికి సంబంధించిన కేసులో తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రసారం చేశారని కేజే. జార్జ్ ఆరోపించారు.

బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి డీకే. రవి మృతి చెందిన సమయంలో తాను కర్ణాటక హోం శాఖ మంత్రిగా ఉన్నానని చెప్పారు. డీకే. రవి కేసుకు సంబంధించి 2015 మార్చి 23వ తేదీన టైమ్స్ నౌ చానల్ లో తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారని మంత్రి జార్జ్ అన్నారు.

Defamation case against Arnab Goswami and Times Now by Karnataka Minister

ఎలాంటి ఆధారాలు లేకుండా తన మీద చేసిన అరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన పరువు పోయిందని విచారం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణలో డీకే. రవి ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల వెలుగు చూసిందని ఇదే సమయంలో జార్జ్ గుర్తు చేశారు.

తనపరువు తీసి ప్రజల్లో చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నించిన జార్జ్ అర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ చానల్ మీద పరువు నష్టం దావా వేశానని జార్జ్ చెప్పారు. బెంగళూరు 10వ ఏసీఎంఎం న్యాయస్థానం కేసు విచారణకు స్వీకరించింది. మొత్తం మీద అర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ చానల్ ప్రతినిధిలు ఈ కేసు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+