హరీశ్ రావత్ ఒంటెద్దు పోకడలు: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ దుస్థితి
వరుసగా ప్రముఖ నాయకుల ఫిరాయింపులు.. ఆపై టిక్కెట్లు రాక అసమ్మతితో రగులుతున్న నేతల ధిక్కారస్వరం.. ఫలితంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడమే కాక 70 స్థానాల అసెంబ్లీలో.
డెహ్రడూన్: వరుసగా ప్రముఖ నాయకుల ఫిరాయింపులు.. ఆపై టిక్కెట్లు రాక అసమ్మతితో రగులుతున్న నేతల ధిక్కారస్వరం.. ఫలితంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడమే కాక 70 స్థానాల అసెంబ్లీలో ఆ పార్టీ బలం కేవలం 11 స్థానాలకు పడిపోయింది.
దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన, ఘోర పరాజయమే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ హాజరైన ఐదు బహిరంగ సభలతోనే పరిస్థితి మొత్తం మారిపోయింది.
56 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు నెలకొల్పింది. సీఎంగా హరీశ్ రావత్ నాయకత్వం పట్ల వ్యతిరేకతతో ఒకనాటి విజయ్ బహుగుణ తదితర 12 మంది పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రముఖ నేతలు బీజేపీలో కలిసిపోతే, మరికొందరు టిక్కెట్ పట్ల ఆకాంక్షాపరులు సీట్లు దొరక్క ప్రత్యర్థులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒకరిద్దరు మినహా తిరుగుబాటుదారులంతా ఎమ్మెల్యేలే
12 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు నేతలు ఇద్దరు మినహా అంతా బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మాజీ సీఎం విజయ్ బహుగుణ తనయుడు సౌరవ్ బహుగుణ తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన సితార్ గంజ్ స్థానం నుంచే 28,450 ఓట్లతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

యశ్ పాల్ సహా పలువురు మాజీ కాంగ్రెస్ నేతల విజయం
మరో మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యశ్ పాల్ ఆర్యా కుమారుడు సంజీవ్ కూడా బీజేపీ అభ్యర్థిగా నైనిటాల్ స్థానం నుంచి 7,247 ఓట్లతో విజయం సాధించారు. కుమాన్ ప్రాంతంలో ప్రముఖ నాయకుడిగా ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు యశ్‌పాల్ ఆర్యా ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి బాజ్‌పూర్ స్థానం నుంచి స్ఫూర్తిదాయక విజయం సాధించారు. ఇంకా కున్వర్ పరనవ్ సింగ్ చాంపియన్, సుబోధ్ ఉనియల్, హరక్ సింగ్ రావత్, ప్రదీప్ బత్రా, ఉమేశ్ శర్మ కౌ, రేఖా ఆర్యా బీజేపీ నుంచి గెలుపొందిన ప్రముఖ మాజీ కాంగ్రెస్ నేతలు.

రెండు చోట్ల హరీశ్ ఓటమి
అగ్నికి ఆజ్యం పోసినట్లు పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ సీట్ల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు కొందరు అవకాశం లభించని పార్టీ నేతల అసమ్మతితో ‘ఓటమి బాధితుడి'గా మారారు. సహస్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసిన కిశోర్ ఉపాధ్యాయపై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన ఆయన మాజీ సహచరుడు ఆర్యేంద్ర శర్మకు బీజేపీ మద్దతుగా నిలిచింది. చివరకు హరీశ్ రావత్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు.

హరీశ్ రావత్ బ్లాక్ మెయిల్ రాజకీయం
అసలు 2012లోనే ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు, వ్యతిరేకత మొదలైంది. విజయ్ బహుగుణను సీఎంగా నియమించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని హరీశ్ రావత్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేస్తానని బెదిరింపులకు దిగారు. సొంతంగా పార్టీ పెడతానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. దీంతో నాటి కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం రంగంలోకి దిగింది. హరీశ్ రావత్‌ను బుజ్జగించింది. నాటి యూపీఏ - 2 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి నుంచి క్యాబినెట్ హోదాకు ప్రమోట్ చేసింది.

సత్పాల్ మహరాజ్ నిష్క్కమణ కాంగ్రెస్‌కు కుదుపు
నాటి నుంచి విజయ్ బహుగుణకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చారు. 2013లో ప్రక్రుతి వైపరీత్యాలతో అంది వచ్చిన అవకాశాన్ని వనియోగించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ బహుగుణను పక్కకు తప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హరీశ్ రావత్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. హరీశ్ రావత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత సత్పాల్ మహారాజ్ బీజేపీ గూటికి చేరుకున్నారు. సత్పాల్ మహరాజ్ నిష్క్కమణ ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు వంటిది. హరీశ్ రావత్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ ఇతర నేతల ఎదుగుదలను అడ్డుకుంటూ వచ్చారు. దీంతో పార్టీ నేతల్లో సాధారణంగా నెలకొన్న అసంత్రుప్తి తిరుగుబాటుకు దారి తీసింది.

భారీ వలసతోనే నష్టమని పీసీసీ అంగీకారం
ఇది చివరకు గతేడాది మార్చిలో పది మంది ఎమ్మెల్యేలు.. హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఆయన ప్రభుత్వం కూల్చివేతకు ప్రయత్నం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన తిరిగి సీఎం పదవిని అలంకరించినా అప్పటికే నష్టం జరిగిపోయింది. విజయ్ బహుగుణతోపాటు పది మంది ఎమ్మెల్యేలు.. వారి వెంటనే ప్రముఖ నేత యశ్ పాల్ ఆర్యా వైదొలడంతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని ఎదురుదెబ్బలు తిన్నది. పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ కూడా పార్టీ నుంచి భారీ స్థాయిలో నిష్క్రమణలే తమ విజయావకాశాలను దెబ్బతీశాయని అంగీకరించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications