చైనాకు చెక్ పెట్టిన భారత్..!!
India China border disputes: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాంతియుత వాతావరణం నెలకొనడానికి భారత్ చేపట్టిన చర్చలు ఫలించాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతున్న యుద్ధ వాతావరణం చల్లారినట్టే కనిపిస్తోంది.
లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు.

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరించారు. పాంగ్యాంగ్ త్సో సరస్సు, గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో సైనికులు యుద్ధానికి సిద్ధం అయ్యారు.
సుమారు 40 వేల మంది వరకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు అక్కడ మొన్నటివరకూ మోహరించే ఉన్నారు. ఈ విషయంలో భారత్ కూడా వెనకడుగు వేయలేదు. ప్యాంగ్యాంగ్ త్సొ, గాల్వన్ వ్యాలీ, కైలాష్ రేంజ్, గోప్రా పీపీ 17ఏ, గోప్రా పీపీ 15, గోగ్రా హాట్ స్ప్రింగ్ ప్రాంతానికి సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రినీ తరలించింది.
ఆ తరువాత రెండు దేశాల మధ్య ఆర్మీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు ఏర్పాటయ్యాయి. అనేక దఫాలుగా సాగాయి. సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవాలనే సింగిల్ అజెండా కింద చర్చలను నిర్వహించారు. బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద సుదీర్ఘంగా కొనసాగాయి.

ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు అప్పట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందడుగు వేశారు. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది.
దానికి అనుగుణంగా సైనిక తరలింపు ఆరంభమైంది. ఇదివరకు గాల్వన్ లోయ, ఆ తరువాత చెక్ పోస్టుల వద్ద నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్నాయి భారత్, చైనా. మూడో విడతగా ఇప్పుడు తాజాగా డెస్పాంగ్ ప్లెయిన్, డెమ్‌చోక్ నుంచి సైనికుల తరలింపు మొదలైంది. యుద్ధ సామాగ్రిని సైతం అక్కడి నుంచి వెనక్కి రప్పిస్తోంది.
2020 జూన్‌కు ముందు నాటి సాధారణ పరిస్థితులు ఇప్పుడక్కడ క్రమంగా నెలకొంటోన్నాయి. సైనిక తరలింపు కార్యక్రమాన్ని చైనా విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ధృవీకరించారు. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల మేర తమ జవాన్లను వెనక్కి పిలిపించుకుంటోన్నామని తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications