డోక్లాం ఎఫెక్ట్: చైనాకు భారత్ షాక్, 1.3బిలియన్ల గ్లాండ్ కొనుగోలు బ్లాక్
డోక్లాం(భారత్-చైనా సరిహద్దు ప్రాంతం)లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఫార్మా కంపెనీకి భారత్ భారీ షాకిచ్చింది.
బ్లూమ్‌బర్గ్: డోక్లాం(భారత్-చైనా సరిహద్దు ప్రాంతం)లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఫార్మా కంపెనీకి భారత్ భారీ షాకిచ్చింది. భారత్‌లో గ్లాండ్ ఔషధ పరిశ్రమతో షాంఘైకి చెందిన ఫోసన్ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ.. గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్ ఫార్మా 86శాతం వాటా(1.3 బిలియన్ డాలర్లకు) కొనుగోలు బ్లాక్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై సదరు కంపెనీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

1962 చైనాతో యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య తరచూ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఇటీవల భారత సరిహద్దలోకి చైనా దళాలు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే తాము యుద్ధానికి సిద్ధమేనంటూ చైనా పలుమార్లు భారత్‌ను బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు చేసింది. అయితే, భారత్ కూడా అదే స్థాయిలో చైనాకు బదులిచ్చింది. తామేం వెనుకడుగు వేయబోమని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications