పీకలదాక తాగేసి భార్యను చంపేసిన భర్త, పక్కనే నిద్రపోయాడు, మరుసటి రోజు మత్తు దిగింది !

పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను చంపేసిన భర్తరీఫర్ తీసుకుని పిల్లల ముందే భార్యను చితకబాదేశాడు. కుప్పకూలిన భార్యరక్తపుమడుగులో పడి ఉన్న భార్య పక్కనే నిద్రపోయాడు, ఉదయం భార్య చనిపోయిందని తెలి

Recommended Video

    Top 10 News టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

    బంగళూరు: పీకలదాక మద్యం సేవించిన వ్యక్తి ఇంటికి వెళ్లి మత్తులో భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. భార్య రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించలేని స్థితిలో ఉన్న అతను ఉదయం భార్య చనిపోయిందని గుర్తించి నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని లొంగిపోయాడు.

    కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని ఉత్తవళ్లి గ్రామంలో మంజు, చిక్కతాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. మంజు, చిక్కతాయమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేసే మంజు ప్రతి రోజు రాత్రి పీకల దాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడేవాడు.

    Drunkard husband murdered his wife Chinnatayamma and surrendered to poilce in Karnataka

    ప్రతిరోజు మంజు, చిక్కతాయమ్మ గొడవపడే సమయంలో స్థానికులు నచ్చచెప్పి చివరికి విసిగిపోయారు. ఎప్పటిలాగే గురువారం రాత్రి 11 గంటలకు పీకలదాక మద్యం సేవించిన మంజు ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న మంజు సమీపంలోని రీఫర్ తీసుకుని పిల్లల ముందే భార్య చిక్కతాయమ్మను చితకబాదేశాడు.

    ప్రతి రోజు జరిగే గొడవే కదా అంటూ చుట్టుపక్కల వారు పట్టించుకోలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య పక్కనే మంజు నిద్రపోయాడు. తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో చిక్కతాయమ్మ అక్కడే మరణించింది. శుక్రవారం మత్తు దిగడంతో భార్య మరణించిదని గుర్తించిన మంజు నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని లొంగిపోయాడు. అప్పటి వరకూ గ్రామస్తులకు కూడా చిక్కతాయమ్మ హత్యకు గురైన విషయం తెలీలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+