తమిళనాడు ప్రభుత్వం: శశికళ వర్గానికి భారీ ఎదురు దెబ్బ: టైం లేదని చెప్పిన ఎన్నికల కమిషన్!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే విషయంలో అఫిడవిట్లు సమర్పించడానికి తమకు ఇంకా సమయం కావాలని మనవి చేసిన వీకే. శశికళ నటరాజన్ వర్గంలోని టీటీవీ దినకరన్ కు చుక్కెదురైయ్యింది.
తాము ఇంత వరకు ఇచ్చిన సమయం చాల ఎక్కువని, ఇంకా సమయం కావాలని మీరు కోరడం సరైన పద్దతి కాదని భారత ఎన్నికల కమిషన్ టీటీవీ దినకరన్ వర్గానికి సూచించింది. ఇప్పటి వరకు మీరు సమర్పించిన పత్రాలు, అఫిడవిట్లు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పింది.

అక్టోబర్ 5వ తేది 3 గంటలకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలో నిర్ణయిస్తామని, అంతకు ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అఫిడవిట్లు సమర్పించాలని రెండు వర్గాలకు భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 28వ తేదీ వరకు సమయం ఇచ్చింది.
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయించాలి అనే విషయంలో వివరణ ఇవ్వడానికి మాకు ఇంకా 15 రోజులు సమయం కావాలని టీటీవీ దినకరన్ వర్గం భారత ఎన్నికల కమిషన్ కు టీటీవీ దినకరన్ వర్గం మనవి చేసింది. టీటీవీ దినకరన్ వర్గం చేసిన మనవిని భారత ఎన్నికల కమిషన్ తిరస్కరించడంతో శశికళ వర్గానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది.












Click it and Unblock the Notifications