తిరుగుబాటుదారులు.. నడిచే మృతదేహాలు: ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటోన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోన్నారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లను జారీ చేయడంతో ఇది మరో మలుపు తిరిగింది.
రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్.. కీలక పాత్ర పోషిస్తోన్నారు. ఉద్ధవ్ థాకరేకు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తోన్నారు. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వస్తోన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్‌నాథ్ షిండేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి జీవం లేకుండా వారు ముంబైకి చేరుకుంటారంటూ విమర్శలు గుప్పించారు.

— Sanjay Raut (@rautsanjay61) June 28, 2022

Click it and Unblock the Notifications