వివాహేతర సంబంధం: తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కొడుకు
తిరువనంతపురం: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండడమే కాకుండా తనకు కాలేజీ ఫీజు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన తల్లిని చంపేశాడు ఓ కొడుకు ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొంది.తనకు డబ్బులివ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వడంతో ఆగ్రహంతో తల్లిని చంపేశాడని పోలీసులు గుర్తించారు.
కేరళలోని అక్షయ్‌కుమార్ అనే యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఇంజనీరింగ్ చదవుతున్న అక్షయ్ కాలేజీ ఫీజు ఇవ్వలేదనే కారణంగా తల్లిని హత్య చేశారు.
క్రిస్మస్ రోజునే తల్లిని గొంతు పిసికి చంపేశాడు. అంతేకాదు కిరోసిన్ పోసి తల్లి శవాన్ని కాల్చేశాడు. సగం కాలిన శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. పోలీసుల విచారణలో నిందితుడు అసలు విషయాన్ని ఒప్పుకొన్నాడు.

వివాహేతర సంబంధం కారణంగా హత్య
తన తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొందని అక్షయ్ ఆరోపిస్తున్నాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా కానీ తన తల్లి తన మాట వినలేదని అక్షయ్ పోలీసులకు చెప్పాడు.అంతేకాదు తనకు కాలేజీ ఫీజుకు డబ్బులు కూడ ఇవ్వలేదన్నారు. తనకు డబ్బులు ఇవ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వడంతో కోపంతో చంపేశానని అక్షయ్ పోలీసుల విచారణలో చెప్పాడు.

ఇంట్లోనే శవం పూడ్చివేత
డిసెంబర్ 25వ, తేదిన అక్షయ్ తన తల్లిని గొంతు పిసికి చంపేశారు. అంతేకాదు ఆమె శవాన్ని కిరోసిన్ పోసి తగులబెట్టాడు. అయితే ఆమె శరీరం పూర్తిగా కాలిపోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటి ఆవరణలోనే సగం కాలిన మృతదేహన్ని పూడ్చివేశాడు.

తండ్రి మస్కట్‌లో
అక్షయ్ తండ్రి మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్షయ్ సోదరి మరో దేశంలో ఉద్యోగం చేస్తోంది. తల్లితో పాటు అక్షయ్ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. తల్లి ఎల్‌ఐసీ ఏజంట్‌గా పనిచేస్తోంది. అయితే కొంత కాలంగా తన తల్లికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అక్షయ్ ఆరోపణలు చేస్తున్నాడు.

డిఎన్ఏ పరీక్ష
అక్షయ్ చూపిన ప్రదేశంలో పోలీసులు తవ్వితే సగం కాలిన మృతదేహం దొరికింది. అయితే ఈ మృతదేహనికి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ మృతదేహం అక్షయ్ తల్లిదేనని తేలిందని పోలీసు అధికారి ప్రకాష్ తెలిపారు.












Click it and Unblock the Notifications