అసలైన దీపావళి: సుప్రీం తీర్పుపై శశికళ, ఊహించానన్న సుబ్రమణ్యస్వామి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.
సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించానని చెప్పారు. శశికళపై సుప్రీంకోర్టు విధించిన ఈ తీర్పునుంచి ఆమె తప్పించుకోలేరని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
శశికళ రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్పిన సుబ్రమణ్యస్వామి.. ఆ పిటిషన్ కూడా తాజా తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనానికే వెళుతుందని చెప్పారు. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి గవర్నర్ వెంటనే ముగింపు ఇవ్వాలని ఆయన సూచించారు.
అసలైన దీపావళి: సుప్రీం తీర్పుపై శశికళ పుష్ప స్పందన

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంపై అన్నాడీఎంకే బహష్కృత ఎంపీ శశికళ పుష్ప స్పందించారు. ఆమె మొదటి నుంచి శశికళ నటరాజన్ అధికారాన్ని విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.
మంగళవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ... ప్రజలకు ఈ రోజు అసలైన దీపావళి అని ఆమె అన్నారు.సీఎం కావాలనుకున్న శశికళకుదారులు మూసుకుపోవడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో గూండాయిజం, రౌడీయిజం ఓడిపోయాయని అన్నారు. భారత్‌లో మంచి ప్రజాస్వామ్యం ఉందని కోర్టు తీర్పు ద్వారా తేలిందని అన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications