పఢ్నవీస్ పట్టభిషేకం, డిప్యూటీ సీఎంగా - ఢిల్లీ కొత్త ట్విస్ట్ ..!!

మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. తొలి నుంచి అంచనా వేసినట్లుగానే ఫడ్నవీస్ ను బీజేపీ నాయకత్వం సీఎంగా ఖరారు చేసింది. బీజేపీ శాసనసభా పక్షం ఫడ్నవీస్ ను ఎంపిక చేసిన తరువాత మహాయుతి నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. దీంతో, నేడు ప్రధానితో పాటుగా ఎన్డీఏ ముఖ్యుల సమక్షంలో మహారాష్ట్రకు మూడో సారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంల పైన స్పష్టత వచ్చింది. కానీ, శాఖల ఖరారులో మాత్రం బీజేపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.

మూడో సారి సీఎంగా
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి ఎంపిక పైన పది రోజులకు పైగా సస్పెన్స్ కంటిన్యూ అయింది. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్ ను ఎన్నుకున్నారు. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌తో కలిసి ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిశారు. ఈ సాయంత్రం ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో తనతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు. మూడు పార్టీల నుంచి మంత్రుల సంఖ్య పైనా ఒక అంచనాకు వచ్చారు. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం పై కొంత ఉత్కంఠ కనిపించినా..చివరకు ప్రమాణంకు సిద్దమయ్యారు.

Fadnavis will be sworn in as Chief Minister at Mumbai s historic Azad Maidan

బీజేపీ వ్యూహాంతో
బీజేపీతో కలిసిన శివసేన - ఎన్సీపీ చీలిక వర్గం నేతలు ఈ సారి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించారు. నాడు షిండేను సీఎం చేసే వేళ ఫడ్నవీస్ తోనే బీజేపీ నాయకత్వం పేరు ప్రతిపాదిం చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. షిండే ప్రభుత్వంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పని చేసారు. ఇప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వంలో తిరిగి షిండే డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. 2019లో ఎన్సీపీ చీలిక వర్గంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో అజిత్ పవార్ వేకువజామునే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు వివరాలు వెల్లడించే సమయం లోనూ షిండే ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎంగా ఫడణవీస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆజాద్‌ మైదాన్‌లో జరపటానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

ప్రధాని సమక్షంలో
దేవేంద్ర ఫడణవీస్‌ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1999 లో తొలి సారి ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్ వరుసగా నాలుగుసార్లు 2009, 2014, 2019, 2014లోనూ గెలుస్తూ వచ్చారు. 2014-19 వరకు మహారాష్ట్ర ముఖ్యమత్రిగా పనిచేశారు. 2019 లో తిరిగి సీఎం అయినా..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రాజీనామా చేసారు. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు .. సమన్వయంలో కీలకంగా వ్యవహరించారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+