Family: 15 ఏళ్లు ప్రేమగా చూసుకున్న భార్యను ఆవేశంలో చంపేశాడు, ఒక్క విషయంలో జీవితాలు !

బెంగళూరు: 15 సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన దంపతులు కేవలం రూ. 2.50 లక్షల కారణంగా మా జీవితాలు నాశనం అవుతాయని ఊహించలేకపోయారు. బెంగళూరులోని మత్తికెరెలో నివాసం ఉంటున్న దానేంద్ర అతని భార్య అనుసూయాను హత్య చేసి ఇప్పుడు పోలీసుల ముందు బోరున విలపిస్తున్నాడు.

మత్తికెరెలో నివాసం ఉంటున్న అనసూయా, దానేంద్ర దంపతులు ఇద్దరూ టైలర్ పని చేస్తున్నారు. అనసూయా లేడీస్ టైలర్ గా పని చేస్తూ భర్త దానేంద్రకు ఆర్థికంగా సహాయం చేస్తోంది. కుటుంబ నిర్వహణ కోసం గత ఏడాది దానేంద్ర రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. అప్పు చేసి సంవత్సరం దాటిపోయింది, అప్పు తీర్చేయాలని అనసూయా ఆమె భర్త దానేంద్రకు కొంతకాలంగా చెబుతూ ఉంది.

Family: Husband killed wife in Bengaluru city.

రాత్రి ఇంటికి వెళ్లిన దానేంద్ర అతని భార్య అనసూయాతో ఇదే విషయంలో గొడవ పెట్టుకున్నాడు. వేకువ జామున నిద్రలేచిన దానేంద్ర కత్తి తీసుకుని అతని భార్య అనసూయా గొంతులో పొడిచి చంపేశాడు. కూతురు సహనాను కూడా హత్య చెయ్యాలని ప్రయత్నించడంతో తీవ్రగాయాలై ఆ అమ్మాయి తప్పించుకుంది.

భార్య అనసూయాను హత్య చేసిన తరువాత దానేంద్ర అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే కూతురు సహనా అనాథ అవుతుందనే భయంతో అతను పోలీసులకు లొంగిపోయాడు. 15 సంవత్సరాలు తనను ఎంతో ప్రేమతో చూసుకున్న తన భార్య అనసూయాను అనవసరంగా చంపేశానని దానేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని యశవంతపురం పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+