పుట్టిన రోజు వేడుకలు: టెక్కీ భార్య ఆత్మహత్య
బెంగళూరు: చిన్న విషయంలో భర్తతో గొడవపడిన టెక్కీ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలోని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన రామ్ ప్రసాద్, సంజనా (25) దంపతులు.
వీరిద్దరు బెంగళూరు చేరుకుని దేవసంద్ర- హుడి మార్గంలోని అయ్యప్ప నగరలో నివాసం ఉంటున్నారు. 20 రోజుల క్రితం వీరు ఇక్కడ కాపురం పెట్టారు. రామ్ ప్రసాద్ ఐబీఎం కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి రామ్ ప్రసాద్ స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాడు.

ఆదివారం రాత్రి రామ్ ప్రసాద్ ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సంజనా భర్తతో గొడవ పడింది. ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు వేరువేరు గదులలోకి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో రామ్ ప్రసాద్ భార్య సంజనా ఉన్న గది దగ్గరకు వెళ్లాడు.
తలుపు తీయాలని సూచించాడు. ఎంతసేపటికి ఆమె నుండి స్పందన లేకపోవడంతో తలుపు పగలగొట్టి చూశాడు. అప్పటికే సంజనా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునిందని రామ్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ సంజీవరాయ తెలిపారు.
దైవదర్శనానికి వెళ్లి!
తుమకూరు జిల్లా శిరాకు చెందిన రాజప్ప (40) ప్రసిద్ది చెందిన ధర్మస్థలంలోని శ్రీ మంజునాథ స్వామిని దర్శించుకొవడానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో నేత్రావతి నదిలో స్నానం చేస్తున్న సమయంలో నీటిలో కొట్టుకుని వెళ్లాడు. ఆ సమయంలో స్థానికులు అతనిని రక్షించి బెళ్తంగడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై రాజప్ప మరణించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications