కొడుకు వేధింపులు: మర్మాంగాన్ని కోసుకున్న తండ్రి
బెంగళూరు: మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రవర్తన భరించలేక ఓ తండ్రి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా జట్టి అగ్రహార గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జట్టి అగ్రహార గ్రామానికి చెందిన సంజీవరాయప్ప(69) భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. కాగా, తన నివాసంలోనే కుమారుడు నాగరాజుతో కలిసి ఉంటున్నాడు సంజీవరాయప్ప. అయితే, మద్యానికి బానిసైన నాగరాజు తరచూ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేసేవాడు.

దీంతో అతని కుమారుడు, భార్య కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్లిపోయారు. వృద్ధాప్యం కారణంగా మంచానికే పరిమితమైన సంజీవరాయప్ప.. కుమారుడి వేధింపులు భరించలేకపోయాడు. తరచూ మద్యం తాగి వచ్చి రాయప్పను దుర్భాషలాడటంతపాటు అందిన వస్తువుతో కొట్టేవాడు నాగరాజు.
శుక్రవారం రాత్రి కూడా నాగరాజు తన తండ్రి రాయప్పను తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సంజీవరాయప్ప.. శనివారం ఉదయం కుమారుడు బయటికి వెళ్లగానే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. బాధ భరించలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు ఆస్పత్రిలో చేర్పించారు.
కొరటిగెర ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాయప్ప. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications