గ్రాండ్ గా అమ్మాయికి పెళ్లి చేసిన ఫ్యామిలీ, పాత ప్రియుడితో అక్రమ సంబంధం, ఎస్కేప్, పరువు హత్య!
బెంగళూరు/బళ్లారి: పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపిస్తే పాప పుట్టినా పాత ప్రియుడి మోజులో తిరుగుతున్న కుమార్తెను అంతం చెయ్యాలని తండ్రి నిర్ణయించారు. ఎన్నిసార్లు చెప్పినా పాత ప్రియుడితో తిరుగుతు ఇంటి పరుపు బజారుకు ఈడ్చిందని రగిలిపోయిన తండ్రి పరువు హత్య చేశాడు. తండ్రి దూరం కావడం, తల్లి హత్యకు గురి కావడంతో ఆరు నెలల చిన్నారి అనాధ అయ్యింది. పెళ్లి అయిన ప్రియురాలు హత్యకు గురి కావడంతో ఎక్కడ తనును చంపేస్తారో అనే భయంతో ప్రియుడు మాయం అయ్యాడు.

చిన్ననాటి ప్రియుడు
కర్ణాటకలోని బళ్లారిలోని గొడెహళ్ళిలో అంజనప్ప నివాసం ఉంటున్నారు. అంజనప్ప కుమార్తె కవిత (24). కవిత గొడెహళ్ళిలో నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించింది. ప్రియుడిని వివాహం చేసుకోవాలని కవిత నిర్ణయించింది. అయితే ప్రియుడిని కవిత వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.

గ్రాండ్ గా పెళ్లి చేసిన తండ్రి
ప్రియుడితో కవిత తిరుగుడు ఎక్కువ కావడంతో అది చూసి అంజనప్ప తట్టుకోలేకపోయాడు. నాలుగు సంవత్సరాల క్రితం వేరే యువకుడితో కవిత వివాహం వైభవంగా చేశారు. వివాహం అయిన తరువాత పుట్టింటికి వచ్చి వెలుతున్న కవిత ఆ సమయంలో మళ్లీ పాత ప్రియుడితో తిరగడం మొదలు పెట్టింది.

ప్రియుడు, ప్రియురాలు జల్సాలు
పెళ్లి జరిగినా కవిత ప్రియుడితో అక్రమ సంబంధం సాగించింది. కవితకు ఆరు నెలల పాప ఉంది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా కవిత మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి రావడం, ప్రియుడితో తిరుగుతూ జల్సాలు చెయ్యడం మొదలు పెట్టింది.

ప్రియుడితో ఎస్కేప్
నెల రోజుల క్రితం పాపను ఇంటిలో వదిలేసి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన కవిత ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కవిత రాత్రి అయినా తిరిగిరాకపోవడం, ఇంటిలోనే పాప ఉండటంతో ఆందోళన చెందిన భర్త ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే కవిత ప్రియుడితో కలిసి పారిపోయింది.

కూతురిని పట్టుకున్న తండ్రి
భర్త, బిడ్డను వదిలేసి ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా కాపురం పెట్టిన కవిత ఆచూకి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు బుద్దిమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అయినా పద్దతి మార్చుకోని కవిత మళ్లీ ప్రియుడిని కలవడానికి ప్రయత్నించింది. కవితను కలవడానికి ఆమె ప్రియుడు ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు.

పరువు పోయిందని చంపేసిన తండ్రి
ఎంత చెప్పినా బుద్దిమార్చుకోవడం లేదని, తమ కుటుంబ పరువు బజారులో పడిందనే ఆవేదనతో ఇంటిలో నిద్రపోతున్న కవితను ఆమె తండ్రి అంజనప్ప గొంతు నులిమి హత్య చేశాడు. కవిత చినిపోయిందని నిర్దారించుకున్న అంజనప్ప నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని తన కుమార్తెను హత్య చేశానని లొంగిపోయాడు. ఎంత చెప్పినా తన కుమార్తె పద్దతి మార్చుకోలేదని, మా కుటుంబంతో పాటు భర్త కుటుంబం పరువు బజారులో పడిందని, అందుకే కవితను చంపేశానని అంజనప్ప పోలీసుల ముందు అంగీకరించాడు. అక్రమ సంబంధం కారణంగా కవిత పరువు హత్యకు గురి కావడంతో తనను ఎక్కడ చంపేస్తారో అనే భయంతో ఆమె ప్రియుడు మాయం అయ్యాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications