కోయంబేడు బస్టాండులో అగ్నిప్రమాదం, రెండు బస్సులు దగ్ధం

చెన్నై : తమిళనాడు బస్టాండ్ లో అగ్నిప్రమాదం జరిగింది. కోయంబేడు బస్టాండులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు. కానీ మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

fire accident at koyambade bus stand

కోయంబేడు బస్టాండులో శనివారం ట్రావెల్స్ బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేందుకు నిలిచి ఉన్న బస్సుల నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పివేశారు. అయితే మంటలు ఎక్కువగా వ్యాపించడంతో అప్పటికే రెండు బస్సులు దగ్ధమయ్యాయి. బస్టాండులో బస్సులు అగ్నిప్రమాదానికి గురవడం కలకలం రేపింది. దీంతో చుట్టుపక్కల వారు భయంతో గజగజ వణికిపోయారు. మరోవైపు ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా ? అనే కోణంలో విచారిస్తున్నారు. విచారణ తర్వాత నిజ నిజాలు తేలుస్తాయని పోలీసులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+