50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రం
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే అలాంటి కస్టమర్లకు అదనపు ఛార్జీలు వర్తించవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు ఒక ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయలు విత్‌డ్రా చేస్తే అలాంటి వారిపై 2శాతం టీడీఎస్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఇది కేవలం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే తీసుకుంటున్న నిర్ణయం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఈ లావాదేవీలన్నిటినీ రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకులు పర్యవేక్షిస్తాయని సీతారామన్ చెప్పారు. ఇక డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆదాయపు పన్నుశాఖ చట్టంలో పలు సవరణలు చేయనుంది. ఇక ఇప్పటిరే భీమ్, యూపీఐ, యూపీఐ-క్యూఆర్ కోడ్, ఆధార్ పే, పలు డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా పేమెంట్లు చెల్లించే అవకాశం ఉందని వివరించారు.

ఇక డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని గుర్తుచేశారు నిర్మలా సీతారామన్. ఇక అదే సమయంలో నగదు రహిత చెల్లింపులను ప్రమోట్ చేసేందుకు కోటి రూపాయల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 2శాతం టీడీఎస్ విధించడం జరుగుతుందని ఆమె చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications