భారీ స్కాం: మాజీ సీఎంకు ఎదురుదెబ్బ

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించారు. కేసు దర్యాప్తు మహారాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసినట్లు సమాచారం.

ఆదర్స్ హౌసింగ్ సొసైటీ కుంబకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అశోక్ చవాన్ పై విచారణ చేపట్టడానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సీబీఐ అధికారులకు గురువారం అనుమతి ఇచ్చారు.

ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆదర్స్ హౌసింగ్ సొసైటీ కుంబకోణం కేసులోని నిందితుల పేర్లు సీబీఐ కచ్చితంగా బయటపెట్టాలని ఇటీవల శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Former CM Ashok Chavan can be prosecuted in Adarsh housing scam

ఈ దర్యాప్తు సవ్యంగా జరగడం లేదని ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొందరు పెద్దలు నేరాలు చేస్తూ వారికి వారే క్లీన్ చిట్ తీసుకుంటూన్నారని ఉద్దవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఇదే సందర్బంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

అమరులైన జవాన్ల కుటుంబ సభ్యుల కోసం ముంబై నగరంలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ పేరుతో భవనాలు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఆ సొసైటీలో భవనాలు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి.

2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తరువాత ఇదే కుంభకోణం కేసుకు సంబంధించి అశోక్ చవాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+