దారుణం : గన్‌తో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

ముజఫర్ నగర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా మహిళలు, బాలికలపై ఆకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ముజఫర్‌నగర్‌లో అక్కాచెల్లెళ్లపై కన్నేసిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. గన్‌తో బెదిరించి ఆకృత్యానికి పాల్పడ్డారు.

ముజఫర్‌నగర్‌లోని కస్వేరా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయసుగల బాలికలు మంగళవారం సాయంత్రం చెరకుతోటలో పనిచేస్తున్న తల్లి వద్దకు బయలు దేరారు. దారిలో కాపుకాచిన నలుగురు దుర్మార్గులు ఆ అక్కాచెల్లెళ్లను అటకాయించారు. గన్‌తో వారిని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు ఏడ్చినా, సాయం కోసం అరిచినా గన్‌తో కాల్చి చంపేస్తామని బెదిరించారు. కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాళ్లు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే యూపీలోని సీతాపూర్ జిల్లాలోనూ ఇలాంటి దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బాలికను మెడికల్ టెస్ట్ చేసిన అనంతరం రిపోర్టు ఆధారంగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు.

Four men allegedly raped two minor at Gunpoint

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత కొన్ని వారాలుగా మైనర్లపై రేప్ ఘటనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+