Girl: డెత్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మహత్య, స్కూల్ ముందు కుటుంబ సభ్యులు, క్లాస్ టీచర్ దెబ్బతో !
బెంగళూరు: స్కూల్ లో చదువుతున్న కూతురిని బాగా చదివించి ఆమె మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని, మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశపడుతున్నారు. అమ్మాయి ఉదయం స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లింది, రెండు రోజులు కుటుంబ సభ్యులతో ఆమె అంటిముట్టనట్లు ఉంది, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తరువాత 10వ తరగతి చదువుతున్న అమ్మాయి డెత్ నోట్ రాసి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

10వ తరగతి అమ్మాయి
బెంగళూరు సిటీలోని రామమూర్తి నగర్ లో అమృత (16) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది. బెంగళూరు సిటీలోని బాణసవాడిలోని మరియం నిలయం స్కూల్ లో అమృత 10వ తరగతి చదువుతోంది. స్కూల్ లో చదువుతున్న కూతురు అమృతను బాగా చదివించి ఆమె మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని, మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశపడుతున్నారు.

మౌనంగా ఉండిపోయిన అమ్మాయి
అమృత ఉదయం స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లింది, రెండు రోజులు కుటుంబ సభ్యులతో అమృత అంటిముట్టనట్లు ఉంది, ఏం జరింది అని కుటుంబ సభ్యులు అడిగినా అమృత సరైన సమాధానం చెప్పలేదు. ఏదో దిగులుగా ఉందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. పనిమీద అమృత కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు.

డెత్ నోట్ రాసి అమ్మాయి ఆత్మహత్య
కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా అమృత ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. డెత్ నోట్ రాసిన అమృత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న రామమూర్తి నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

పరీక్షల్లో మాస్ కాఫీయింగ్
శనివారం స్కూల్ లో పరీక్షలు జరిగాయి. ఆ సందర్బంలో అమృత మాస్ కాపీయింగ్ కు పాల్పడటంతో క్లాస్ టీచర్ అందరి ముందు ఆమెను మందలించారు. ఇదే విషయంలో అమృత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మాయి అమృత ఆత్మహత్యకు క్లాస్ టీచర్, స్కూల్ యాజమాన్యం కారణం అని ఆమె కుటుంబ సభ్యులు అమృత శవాన్ని స్కూల్ ముందు పెట్టి ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications