దారుణం: రేప్‌ను అడ్డుకున్నందుకు తగులబెట్టాడు

UP
లక్నో: ఉత్తరపదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై అత్యాచారానికి ప్రయత్నించడంతో అడ్డుకున్న ఓ అమ్మాయిపై ఆగ్రహించిన దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పింటించాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌‌గఢ్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో బాధితురాలి శరీరం 95శాతం కాలిపోయింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారానికి యత్నించిన దుండగుడు ఆమె ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని టీనా గ్రామంలో బాధిత యువతి తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. తమ పని నిమిత్తం తల్లిదండ్రులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఇది గమనించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. యువతి అతన్ని అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

మంటల్లో కాలిపోతున్న బాధితురాలిని చూసిన బాధితురాలి చిన్న సోదరులు కేకలు వేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు మంటలార్పి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా గత కొంత కాలంగా నిందితుడు బాధితురాలిని వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు నిందితున్ని మందలించి, అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పిడినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+