దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా!

యూత్4జాబ్స్ ఫౌండేషన్‌కు చెందిన 'నాట్‌జస్ట్ఆర్ట్‌’ విభాగం, అదానీ గ్రీన్‌ఎక్స్‌టాక్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన "గ్లోబల్ ఎబిలిటీ ఫోటోగ్రఫీ ఛాలెంజ్ (GAPC) 2026" ఐదో ఎడిషన్‌ను అధికారికంగా ప్రారంభించింది. దివ్యాంగుల్లో దాగి ఉన్న అసాధారణమైన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. విభిన్న ప్రతిభావంతులు తమ వ్యక్తిగత దృక్పథాలను, జీవితానుభవాలను కెమెరా కంటి ద్వారా ఆవిష్కరించేందుకు ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, ఇది పూర్తిగా ఉచితం.

అంతర్జాతీయ గుర్తింపు, గత విజయాలు

ఈ ఫోటోగ్రఫీ ఛాలెంజ్ గత నాలుగు ఎడిషన్లలో అద్భుతమైన స్పందనను మూటగట్టుకుంది. ఇప్పటివరకు 30కి పైగా దేశాల నుంచి సుమారు 50,000 మంది ఫోటోగ్రాఫర్‌లు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 8 మిలియన్ల మందికి ఈ కార్యక్రమం చేరింది. గతంలో ఈ పోటీల్లో ఎంపికైన ఉత్తమ చిత్రాలను జపాన్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ప్రదర్శించడం విశేషం. ఈ ఏడాది కూడా ఔత్సాహిక, ప్రొఫెషనల్ దివ్యాంగ ఫోటోగ్రాఫర్లు తమ సృజనాత్మక కథనాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఆహ్వానితులుగా ఉన్నారు.

నిర్వాహకుల సందేశం

యూత్4జాబ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సీఈవో మీరా షెనాయ్ మాట్లాడుతూ.. సరైన అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కళాత్మక రంగంలో అద్భుతాలు సృష్టించగలరని ఈ చొరవ నిరూపిస్తుందని తెలిపారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ జీత్ అదానీ స్పందిస్తూ, ఫోటోగ్రఫీ అనేది భాషతో సంబంధం లేకుండా కథలను చెప్పగల సార్వత్రిక మాధ్యమమని, ఈ సహకారం దివ్యాంగులకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీ నగదు బహుమతులు, అవార్డులు

ఈ పోటీ అద్భుత ప్రతిభకు గణనీయమైన బహుమతి మొత్తాన్ని అందిస్తుంది. మొదటి బహుమతి రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, మూడో స్థానానికి రూ.2 లక్షలు లభిస్తాయి. నాలుగు నుంచి పదో స్థానం వరకు నిలిచిన వారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష నగదు బహుమతి ఉంటుంది. నగదు బహుమతులతో పాటు టాప్ 20 ఎంట్రీలు ప్రదర్శనలో నిలుస్తాయి. టాప్ 10 విజేతలకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డిజైనర్ మైఖేల్ ఫోలీ రూపొందించిన ట్రోఫీలు అందజేస్తారు. పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు ఉంటాయి. అవార్డుల ప్రదానం, ప్రదర్శన జూన్ 24, 2026న అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

ముగింపు వేడుక

ఈ ఏడాది అవార్డుల ప్రధానోత్సవం,ఫోటోగ్రఫీ ప్రదర్శన జూన్ 24, 2026న అహ్మదాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఎంపికైన భారతీయ విజేతలకు, ఓ అంతర్జాతీయ విజేతకు ప్రయాణ, వసతి ఖర్చులను నిర్వాహకులే భరిస్తారు. ఎంపిక చేసిన ఫోటోలను అంతర్జాతీయ మీడియా, ప్రచార కార్యక్రమాల్లో ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఎంట్రీలు ప్రారంభమయ్యాయి, అర్హులైన దివ్యాంగ ఫోటోగ్రాఫర్లు ఈ అంతర్జాతీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహక బృందం కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+