ప్రజల్ని కాపాడటంలో నాటి ప్రభుత్వం విఫలం: 1984 అల్లర్లపై కాంగ్రెస్ నేత

న్యూఢిల్లీ: 1984లో ఇందిరా గాంధీ మృతి అనంతరం జరిగిన అల్లర్లలో వేలాది మంది సిక్కులు మృతి చెందారు. ఈ ఘటన పైన కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అల్లర్ల సమయంలో ప్రజలను రక్షించడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైందన్నారు.

నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత సిక్కుల పైన దాడులు జరిగాయి. ఈ ఘటనలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.

Government failed to protect people during 1984 riots: Congress leader

దీనిపై సందీప్ దీక్షిత్ తాజాగా స్పందించారు. సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు. మాజీ లోకసభ సభ్యుడు కూడా.

ఆయన మాట్లాడుతూ... స్వతంత్ర భారత దేశంలో ఆనాడు మొదటిసారి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని అబిప్రాయపడ్డారు. నాటి ప్రభుత్వం తన రోల్‌ను పోషించలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అల్లర్లకు సంబంధించిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

'అన్ టోల్డ్ ఎగోనీ ఆప్ 1984' అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. దీనిని ప్రముఖ జర్నలిస్ట్ నిలంజన్ ముఖోపాధ్యాయ రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, రచయితలు తదితరులు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+