కరోనా విలయం: జనవరి 31 వరకు నిబంధనలు పొడిగించిన కేంద్రం -రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు

దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ, కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ భయం పుట్టిస్తున్నది. చలికాలంలో కొత్త రకం వైరస్ మరింత విజృంభించే అవకాశాలుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి విధించిన మార్గదర్శకాలను మోదీ సర్కార్ మరోసారి పొడిగించింది.

వచ్చే ఏడాది(2021) జనవరి 31వరకూ దేశంలో కొవిడ్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Govt extends guidelines on Covid-19 surveillance till 31 Jan, warns about new virus strain

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తుచేసింది. బ్రిటన్‌లో కలకలం సృష్టించిన కరోనా కొత్త వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాలు నిరంతరం నిఘా పెట్టాలని, వైరస్‌ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అంతేకాదు..

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా గుర్తించే విషయంలో, ఆయా జోన్‌లలో కఠినంగా వ్యవహరించే విషయంలో రాజీ పడరాదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. వైరస్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని తెలిపింది. నవంబర్‌ 25న కేంద్ర హోంశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా 20,021 కేసులు, 279 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871కి, 1,47,901కి పెరిగింది. 95.82శాతం రికవరీ రేటుతో ఇప్పటికే 97,82,669మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2.72 లక్షలుగా ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+