గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు 2022: డైలీహంట్‌పై వేగవంతమైన ఫలితాలు విశ్లేషణలు
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.హిమాచల్ ప్రదేశ్‌కు నవంబర్ 12న పోలింగ్ జరగగా, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది.
హిమాచల్ ప్రదేశ్
తన 'అభివృద్ధి' మరియు 'డబుల్ ఇంజన్' నినాదంతో దూసుకుపోతున్న బీజేపీకి ఇది కీలకమైన పరీక్ష, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది.. మరోవైపు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తన ప్రయత్నం చేస్తోంది. అధికార బీజేపీ తన అభివృద్ధి ఎజెండాపై ఆశలు పెట్టుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్, అనేక ఎన్నికల్లో ఓడిపోయి, రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాలను కోల్పోయిన తర్వాత బీజేపీ నుంచి అధికారం లాక్కోవాలని తహతహలాడుతోంది. - రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారికి ఓటు వేయడం దశాబ్దాల సంప్రదాయంగా కొనసాగుతోంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ రాజకీయ పోరులో 68 నియోజకవర్గాల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్ల ఓట్లు తేల్చనున్నాయి. వీరిలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్, సిమ్లా రూరల్ నుంచి పోటీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ఉన్నారు.
BJP కోసం, PM మోడీ ముందు నుండి ప్రచారానికి నాయకత్వం వహించారు, రాష్ట్ర ఓటర్లకు వ్యక్తిగత విజ్ఞప్తితో తన ప్రచారాన్ని ముగించారు, BJP గుర్తు "కమలం" కోసం వేసిన ప్రతి ఓటు తన బలాన్ని పెంచుతుందని చెప్పారు. 'డబుల్ ఇంజన్' పాలన సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని, బీజేపీని మళ్లీ ఎన్నుకోవడం ద్వారా చరిత్రను తిరిగిరాయాలని ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనే ఆధారపడింది. హిమాచల్‌లో కొత్తగా ప్రవేశించి 68 స్థానాలకు గానూ 67 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), గత ట్రెండ్‌లకు అనుగుణంగా బీజేపీ మరియు కాంగ్రెస్‌లకు గట్టిపోటీ ఇస్తుండటంతో ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

గుజరాత్
1995 నుండి గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. కాంగ్రెస్ 40 శాతం ఓట్లను పొందుతున్నప్పటికీ రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించింది.
గెలిచిన సీట్ల సంఖ్య పరంగా కొత్త రికార్డును నెలకొల్పాలని కాషాయ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.ఆప్ ప్రవేశంతో సాంప్రదాయకంగా ద్విముఖ పోటీ ఉండగా ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ముక్కోణపు పోరు జరిగింది.ఐదేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది.
ప్రస్తుతం, 182 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి బలం 111 గా ఉంది, కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలు దానికి ఫిరాయించారు. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ గెలుస్తారని సంకేతాలైతే స్పష్టంగా కనిపించడం లేదు.
Dailyhunt కవరేజ్
Dailyhunt రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఎన్నికలు కేవలం అంకెలు కాదని మేము నమ్ముతున్నాము. ప్రతి పౌరుడి జీవితంపై ప్రభావం చూపే ఎన్నికల్లో ఖచ్చితమైన స్పష్టమైన డేటా, నమూనాలు మరియు విశ్లేషణల వివరణ ఇవ్వడం మా బాధ్యత
ఒక్కసారి ఎన్నికల ఫలితాలు రావడం ప్రారంభమయ్యాక, మేము అన్ని కోణాల నుండి విశ్లేషణ చేస్తాం. డేటా ద్వారా విశ్లేషించి రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి నుంచి రాజకీయ విశ్లేషకులకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా విశ్లేషణ చేస్తాం.
డైలీ హంట్‌లో ఎన్నికల ఫలితాలు అర్థవంతంగా ఉండేలా మా కవరేజ్ ఉంటుంది.
* ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం అదే సమయంలో వేగవంతంగా అందించడం
* గత ఫలితాలతో పోలుస్తూ ఈ ఫలితాల విశ్లేషణ
* రాష్ట్రాల వారీగా మరియు నియోజకవర్గాల వారీగా సీట్ల మార్పులపై సమాచారం
* సోషల్ మీడియా రియాక్షన్, ట్విటర్‌పై ట్రెండ్స్
* లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలు లాంటివి మా కవరేజ్‌లో భాగమవుతాయి. పూర్తి వివరాలకోసం డైలీ హంట్‌కు ట్యూన్ అవ్వండి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications