Halloween: దక్షిణ కొరియాలో 149 మంది మృతి, హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాటకు కారణమేంటి

దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 149 మంది మరణించారు. మరో 76 మంది గాయపడ్డారు.
హాలోవీన్ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
చాలామంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాగా మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.
మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎలా జరిగింది
కోవిడ్ అనంతరం మాస్కులు ధరించకుండా తొలిసారి నిర్వహిస్తున్న హాలోవీన్ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ప్రజలు ఇటైవాన్ నైట్‌లైఫ్ ప్రాంతంలోని వీధిలోంచి వెళ్తున్నారు.
ఈ ప్రాంతం నైట్‌లైఫ్‌కి ప్రసిద్ధి.
వీధి ఇరుకుగా ఉండడం, ప్రజలు పెద్దసంఖ్యలో ఉండడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని, జనం ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్తున్నారు.
తొక్కిసలాట కారణంగా చాలామంది కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. వెంటనే అధికారులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రంగంలోకి దించినప్పటికీ పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పలేదు.
ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్లపై పడి ఉన్నవారికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
వీధుల్లో బ్యాగుల్లో చుట్టిపెట్టిన శవాలు, అత్యవసర సహాయకులు కొందరికి సీపీఆర్ చేస్తున్న దృశ్యాలు ఒక వీడియోలో కనిపిస్తున్నాయి.

మృతుల్లో అత్యధికులు టీనేజర్లే...
మృతుల్లో అత్యధికులు టీనేజర్లు, 25 ఏళ్ల లోపు వారేనని అధికారులు చెప్తున్నారు.
మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి కోవిడ్ నిబంధనలను తొలగించిన తర్వాత సోల్‌లో జరిగిన తొలి హాలోవీన్ ఉత్సవం ఇది.
ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని నియంత్రించటానికి పోలీసులు విఫలప్రయత్నం చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దక్షిణ కొరియాలో హాలోవీన్ అనేది పెద్ద ఉత్సవం కాదు.

దర్యాప్తుకు ఆదేశించిన అధ్యక్షుడు..
గాయపడిన వారికి చికిత్స అందించేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఆదేశించారు.
ఈ ఘోర విపత్తుకు కారణాలపై దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు.
లక్ష మంది ఒకే చోట చేరడంతో
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- మహిళను 'ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications