నేను ఆ భూమిని కబ్జా చేయలేదు: హేమామాలిని
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన భూమిని కారుచౌక ధరకు తన నాట్య సంస్థకు కట్టబెట్టడంపై చెలరేగుతున్న రాజకీయ దుమారంపై బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపి హేమామాలిని స్పందించారు. తానేమీ ఆ భూమిని కబ్జా చేయలేదని స్పష్టం చేశారు.
ఆ భూమిని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని వివరణ ఇచ్చారు. అంధేరి పరిసర ప్రాంతాల్లోని అంబివాలిలో 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం హేమామాలినికి రూ. 70 వేలకే కట్టబెట్టిందని వార్తలు వచ్చాయి.

కాగా, హేమామాలిని నేతృత్వంలోని నాట్యవిహార్ కళాకేంద్ర చారిటీ ట్రస్ట్ ఈ ప్రదేశంలో ఓ నృత్య కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగడంతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలను ఎక్కుపెట్టింది.
ఈ నేపథ్యంలో హేమమాలిని వివరణ ఇచ్చారు. ఈ భూమికి ఇప్పటివరకు తానేమీ చెల్లించలేదని, ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం ధరను చెల్లించి భూమిని కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు.ఈ భూమిని పొందేందుకు 20ఏళ్లుగా కష్టపడుతున్నానని అన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications