టెక్కీ స్వాతి హత్య: సమన్వయలోపంపై హైకోర్టు ఫైర్
చెన్నై: రైల్వే స్టేషన్ వద్ద జరిగిన టెక్కీ స్వాతి హత్య కేసు విషయంలో మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్య చేసింది. ఈ హత్యపై దర్యాప్తు విషయంలో స్థానిక పోలీసులకు, రైల్వే పోలీసులకు మధ్య సమన్వయం లోపించిందనే వార్తలపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది.
శాఖల మధ్య సమన్వయ లోపించిందా అనే విషయాన్ని సంబంధిత అధికారుల నుంచి సమాచారం తీసుకుని సాయంత్రం 3 గంటల లోపల వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎస్ ఎస్ నాగముత్తు, జస్టిస్ వి భారతి దశాన్‌లతో కూడిన డివిజిన్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ షణ్ముగను ఆదేశించింది.

సమన్వయం లోపించినట్లు తేలితే కేసును కోర్టు షూమోటాగా మోనిటర్ చేస్తుందని చెప్పింది. కేసు నగర పోలీసుల పరిధిలోకి రాదని నగర పోలీసు కమిషనర్ అన్నట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ అందులో ఏమైనా నిజం ఉందా అని జస్టిస్ నాగముత్తు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అడిగారు.
తమ పరిధిలోకి రానప్పటికీ నగర పోలీసులు రైల్వే పోలీసులతో కేసు దర్యాప్తులో సహకరిస్తామని చెప్పారు, ఇటువంటి కేసును మోనిటర్ చేసే సామాజిక బాధ్యత కోర్టులకు ఉంటుందని చెప్పారు. 24 టెక్కీ స్వాతి ఈ నెల 24వ తేదీన రైల్వే స్టేషన్ సమీపంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications