వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అవమానించారు’: హేమామాలినిపై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

మధుర: భారతీయ జనతా పార్టీ మధుర ఎంపీ, బాలీవుడ్ నటి హేమామాలినిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హేమామాలిని తనను అవమానకర రీతిలో దూషించారని గ్రామ ప్రధాన్(సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాన్సివట్ పర్యటనకు హేమామాలిని వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని మాంట్‌మూలా గ్రామ ప్రధాన్ భగవతీ దేవి భర్త భగవాన్ సింగ్ ఆరోపించారు.

హేమామాలిని తీరుకు నిరసనగా పలువురు గ్రామస్తులు ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగవాన్ మాట్లాడుతూ.. చెట్లు ఎవరు తొలగించారని ఆమె తమను ప్రశ్నించారని తెలిపారు. కాగా, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని ఆమెకు తెలిపినట్లు చెప్పారు.

 Hema Malini insulted me: village pradhan’s husband

ఆమె తమ మాట వినకుండా తన భార్యను ఎవరు ప్రధాన్ చేశారని నిలదీశారని తెలిపారు. అంతేగాక, తన భార్య ప్యూన్‌గా కూడా పనికి రాదని తిట్టారని చెప్పారు.
కాగా, భగవాన్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమామాలినిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.

English summary
THE HUSBAND of a village pradhan Saturday filed a complaint with the police alleging he was “humiliated and publicly insulted” by BJP MP Hema Malini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X