సోనియా, రాహుల్ కేసు: జోకులతో ట్విట్స్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి మీరు కోర్టులో హాజరవుతున్నారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద సోషల్ మీడియాలో జోకులు పేలిపోయాయి. అనేక మంది వారి మనసులోని మాటలు ఇలా ట్విట్ లు చేశారు.
ట్విట్టర్ ట్రేడింగ్ టాఫిక్స్ లో సోనియా రాహుల్ హాజిర్ హో అనేది టాప్ ట్రెడింగ్ అయ్యింది. సుబ్రమణ్య స్వామిని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయ కక్షలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయితే తాను అవినీతిని అడ్డుకోవడానికి కేసు వేశానని, ఇందులో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని సుబ్రమణ్యస్వామి అంటున్నారు. కాంగ్రెస్ లో ఖరీదైన ఐదు మంది న్యాయవాదులు ఉన్నారని, సోనియా, రాహుల్ కు ఎందుకు అంత భయం అని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు ఇలా స్పందించారు.

చూడు మమ్మి ఇది మోడీ కక్ష
చూడు మమ్మి ఇది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ కక్ష, సుబ్రమణ్యస్వామిని అడ్డుపెట్టుకున్నారని సోషల్ మీడియాలో ఫోటో పెట్టి కామెంట్ చేశారు.
రాహుల్ పరిస్థితి ఇలా ఉంటుంది
కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తే రాహుల్ ఇలా మొదటి ఫోజు, కష్టకాలం వస్తే రాహుల్ ఇలా ఫోజు ఇస్తారని ట్విట్.
సార్ వారిద్దరూ
నేషల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ కోర్టుకు వెలుతున్నారంటూ సిసోడియా చెబుతుంటే కేజ్రీవాల్ ఇలా వింటున్నారంటూ ట్విట్.
అమ్మా అక్కడ చూడు ఎవరొస్తున్నారో
అమ్మా అక్కడ చూడు, సుబ్రమణ్యస్వామి అంకుల్ వస్తున్నారు, ఇప్పడే వెళ్లి సారి చెప్పేస్తా, ఏమంటావ్ అంటూ ట్విట్.
పాటియాల కోర్టు ముందు
పాటియాల కోర్టు ముందు శనివారం మద్యాహ్నాం ఇలాంటి దృశ్యం చూసినా ఆశ్చర్యం లేదంటూ ట్విట్
కోర్టు ఎవరి ఆస్తీ కాదు
సోనియా గాంధీ: నేను ఇందిరా గాంధీ కోడలు ఎవ్వరికీ భయపడను అన్నారు. భారతీయులు: కోర్టు ఇందిరా గాంధీ ఆస్తి కాదు అంటూ ట్విట్
శ్రీమంతుల దేశం మీవల్ల ఇలా అయ్యింది.
శ్రీమంతుల దేశంగా ఉన్న భారత్ కాంగ్రెస్ పరిపాలన వలన నేడు పేదల దేశం అయ్యింది. కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసింది అంటూ ట్విట్.
వన్ సైడ్ న్యూస్ వద్దు
వన్ సైడ్ న్యూస్ చూపించకండి, అరుణ్ జైట్లీ న్యూస్ చూపించండి, చూడు జీ న్యూస్ నేను సోనియా, రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నా అంటూ ట్విట్.
కేజ్రీవాల్ మాట్లాడండి
అరవింద్ కేజ్రీవాల్ గారు, నేషనల్ హెరాల్డ్ వ్యవహారం ఢిల్లీలో జరిగింది, మీరు ఢిల్లీలోనే ఉన్నారు, ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎందుకు మాట్లాడలేదంటూ ట్విట్.
నా లక్షం అవినీతి అంతం
నేను అవినీతిని అంతం చెయ్యడానికి కేసు వేశాను, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తాను: సుబ్రమణ్యస్వామి
సతీష్ ఆచార్యా కార్టూన్
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ప్రముఖ వ్యంగ చిత్రకారుడు సతీష్ ఆచార్య వేసిన కార్టూన్












Click it and Unblock the Notifications