హనీట్రాప్: పాకిస్థాన్ ఏజెంట్‌కు సమాచారం లీక్ చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్

న్యూఢిల్లీ: మరో శాస్త్రవేత్త హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతను ప్రమాదంలో నెట్టేందుకు ప్రయత్నించాడు. ముంబైలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO)లో ఉద్యోగం చేస్తున్న ఒక శాస్త్రవేత్తను పాకిస్థానీ ఏజెంట్‌తో రహస్య సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ATS) గురువారం అరెస్టు చేసింది.

ట్సాప్, వీడియో కాల్‌ల ద్వారా 'పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్' ఏజెంట్‌తో నిమగ్నమై, హనీట్రాప్‌కు గురయ్యాడని శాస్త్రవేత్తపై ఆరోపణలు వచ్చాయి. నిందితుడు 60 ఏళ్ల ప్రదీప్ కురుల్కర్.. పుణెలోని రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్లు) డైరెక్టర్ అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఆర్అండ్ డీఈ(ఈ) అనేది డీఆర్డీవో ముఖ్యమైన ఫెసెలిటీ. కాగా, కురుల్కర్ క్షిపణుల అభివృద్ధితో సహా అనేక ముఖ్యమైన ప్రాజెక్టులలో పాలుపంచుకున్నారు.

 Honey-Trapped DRDO Scientist Arrested For Leaking Classified Information To Pakistani Agent

డీఆర్‌డీఓ ఫిర్యాదు మేరకు కురుల్కర్‌పై దర్యాప్తు ప్రారంభించారు. DRDO వెబ్‌సైట్‌లో కురుల్కర్‌ను "అత్యుత్తమ శాస్త్రవేత్త"గా అభివర్ణించారు. అతను ఆకాష్ గ్రౌండ్ సిస్టమ్స్‌కు ప్రాజెక్ట్ లీడర్, సిస్టమ్స్ మేనేజర్. "అతను ఆకాష్ బృందంలో కీలక సభ్యుడు, ఆకాష్ లాంచర్లు, మిషన్-క్రిటికల్ గ్రౌండ్ సిస్టమ్స్ రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించారు" అని DRDO వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, నవంబర్‌లో కురుల్కర్ పదవీ విరమణ చేయాల్సి ఉంది.

కురుల్కర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎస్ పత్రికా ప్రకటన ప్రకారం.. "తన వద్ద ఉన్న అధికారిక రహస్యాలు, శత్రు దేశం పొందినట్లయితే, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినప్పటికీ.. శత్రు దేశానికి వివరాలను అందించారు' అని పేర్కొంది. ముంబైలోని ఏటీఎస్‌కు చెందిన కాలాచౌకి యూనిట్ అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసింది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏటీఎస్ అధికారిని ఉటంకిస్తూ.. ఇది ప్రాథమికంగా హనీట్రాప్ కేసుగా అనిపిస్తుంది. ఇందులో సీనియర్ శాస్త్రవేత్త పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో పరిచయం కలిగి ఉన్నాడు. కురుల్కర్ సోషల్‌ మీడయాలో మహిళల ఫోటోలను ఉపయోగించి ఆకర్షితుడయ్యాడని అధికారి చెప్పారు. మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో "అతను గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నుంచి వాయిస్ సందేశాలు, వీడియో కాల్‌లను ఉపయోగించి పాకిస్తానీ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు, వారితో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు" అని సదరు అధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+