పఠాన్‌కోట్ విచారణ షాక్: రూ.50 ఇస్తే ఎయిర్‌బేస్‌లోకి!
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన దాడి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎయిర్ బేస్ వద్ద తగినంత భద్రత లేదని, రూ.50 ఇస్తే వాటిని తీసుకొని స్థానికులను అక్రమంగా ఎయిర్ బేస్‌లోకి అనుమతించేవారని దర్యాఫ్తు వర్గాలు తెలిపాయి.
ఎయిర్ బేస్ లోపల ఉగ్రవాదులు దాడి చేసేందుకు స్థానికంగా సాయం అందిందని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించి ఉగ్రవాదులకు సాయపడిన వారిని గుర్తించే దిశగా విచారణ జరుపుతున్నారు.

ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదులు దాడి చేయగా, ఈ దాడిలో ఏడుగురు భద్రతా దళాలు అమరులయ్యారు. ఆరుగురు ఉగ్రవాదులను మన జవాన్లు హతమార్చారు. ఈ దాడి ఘటన పైన జాతీయ దర్యాఫ్తు సంస్థ విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications