Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడికి పచ్చ జెండా, మొగుడికి ఎర్రజెండా, ఇద్దర్నీ ఎలా లేపేశారంటే !

చెన్నై/మదురై/శివగంగై: చక్కగా పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త ఫ్రెండ్ మేడమ్ ను లైన్ లో పెట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకు తెలీకుండా ఎన్నోరకాలుగా ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య మొగుడిని ముంచేసి అతనికి ఎర్ర జెండా చూపించి ప్రియుడికి పచ్చ జెండా చూపించి లేచిపోయింది. ప్రియుడితో కలిసి కాపురం చేస్తున్న భార్యను పట్టుకున్న భర్త, బంధువులు కలిసి ఇద్దరికి భూమి మీద అడ్రస్ లేకుండా చేశారు. అక్రమ సంబంధం కారణంగా భార్య, ఆమె ప్రియుడిని చంపేసిన భర్త కటకటాలపాలైనాడు.

హ్యాపీలైఫ్

హ్యాపీలైఫ్

తమిళనాడులోని రామనాథపురం జిల్లా నైనార్ కోవిల్ మనచనేందళం ప్రాంతానికి చెందిన సతియేంద్రన్ అనే యువకుడికి శివగంగై జిల్లా మనమధురై ప్రాంతంలో నివాసం ఉంటున్న వలర్మతి (23) అనే యువతికి 7 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న వలర్మతి భర్త సతియేంద్రన్ తో కలిసి చక్కగా కాపురం చేసింది.

 వయ్యారాల వలర్మతి

వయ్యారాల వలర్మతి

సతియేంద్రన్, వలర్మతి దంపతులకు ఆరు సంవత్సరాల కుమార్తె, మూడు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు. భర్త, పిల్లలతో కలిసి వలర్మతి సంతోషంగా ఇంతకాలం కాపురం చేసింది. మనచనేందల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వేల్ రాజ్ (20) అనే యువకుడు వలర్మతి భర్త సతియేంద్రన్ కు పరిచయం ఉంది.

 మంచి గేమ్ షో

మంచి గేమ్ షో

భర్త కోసం ఇంటికి వచ్చి వెలుతున్న వేల్ రాజ్ ను వలర్మతి లైన్ లో పెట్టింది. ఫ్రీగా చిక్కిందని వేల్ రాజ్ కూడా వలర్మతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే అప్పటి నుంచి వేల్ రాజ్, వయ్యారాల వలర్మతి అక్రమసంబంధం పెట్టుకున్నాడు. భర్తలేని సమయంలో ప్రియుడు వేల్ రాజ్ ను ఇంటికి పిలిపించుకుంటున్న వలర్మతి పండగ చేసుకునింది.

 ప్రియుడితో భార్య ఎస్కేప్

ప్రియుడితో భార్య ఎస్కేప్

ఫిబ్రవరి 24వ తేదీన పక్కాస్కెచ్ చేసిన వలర్మతి భర్త, పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడు వేల్ రాజ్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. తన భార్య కనపడటం లేదని, ఆమెను వేల్ రాజ్ మోసం చేసి లేపుకుపోయాడని సతియేంద్రన్ నైనార్ టెంపుల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పోలీసులు వలర్మతి, ఆమె ప్రియుడు వేల్ రాజ్ కోసం గాలించారు.

 రెండో మొగుడితో కాపురం

రెండో మొగుడితో కాపురం

తిరుచ్చిలో ఓ అద్దె ఇంటిని తీసుకున్న వలర్మతి, వేల్ రాజ్ అక్కడే కాపురం పెట్టేశారు. ఓ స్నేహితుడి ద్వారా తన భార్య వలర్మతి తిరుచ్చిలో ఉందని సతియేంద్రన్ కు తెలిసింది. వలర్మతి సోదరుడు రసయ్య, మణికందన్, కట్టురాధా, ధనశేఖరన్, భర్త సతియేంద్రన్ న్ తిరుచ్చి చేరుకుని వలర్మతి ఇంటికి వెళ్లారు. జరిగింది ఏదో జరిగిపోయింది, వేల్ రాజ్ ను వదిలేసి ఇంటికి రావాలని అందరూ వలర్మతికి నచ్చచెప్పారు.

 మొగుడు వద్దు.... ప్రియుడు చాలా ముద్దు

మొగుడు వద్దు.... ప్రియుడు చాలా ముద్దు

నేను ఇంటికి రానని, నాకు భర్త వద్దని, ప్రియుడు వేల్ రాజ్ తో కలిసి ఇక్కడే ఉంటానని వలర్మతి మొండికి వేసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త సతియేంద్రన్, బంధువులు అందరూ కలిసి వేల్ రాజ్ ను చితకబాదేసి వలర్మతిని కలంకత్తూరు కుప్పంలోని సొంతగ్రామానికి పిలుచుకుని వెళ్లారు. తీవ్రగాయాలైన వేల్ రాజ్ తిరుచ్చి గాంధీ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో వలర్మతి భర్త సతియేంద్రన్ తదితరుల మీద కేసు పెట్టి ఆసుపత్రిలో చేరాడు.

 దెబ్బకు ఇద్దరూ ఫినిష్

దెబ్బకు ఇద్దరూ ఫినిష్

వలర్మతి బంధువుల చేతిలో తీవ్రగాయాలైన వేల్ రాజ్ చికిత్స విఫలమై ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వలర్మతి భర్త సతియేంద్రన్, అతని సోదరుడు ప్రభును అరెస్టు చేశారు. లేచిపోయింది కాక మామీద కేసు పెట్టిస్తావా అంటూ బంధువులు ధనశేకరన్, కట్టురాజు కత్తులతో వలర్మతి పొడిచి చంపేశారు. అక్రమ సంబంధం కారణంగా జంట హత్యలు జరగడంతో పోలీసులు వలర్మతిని కత్తులతో పొడిచి చంపిన ధనశేఖరన్, కట్టురాజులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా మహిళ, ఆమె ప్రియుడు 24 గంటల్లో హత్యకు గురికావడం తిరుచ్చిలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+