IND vs AUS final: ఇండియా గెలుస్తుందన్న బీజేపీ- అవునన్న కాంగ్రెస్: అర్థం కావాలంటే

అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొడుతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). టాస్.. ఆస్ట్రేలియా వైపే మొగ్గు చూపింది. టాస్ (Toss) గెలిచిన ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. దూకుడుగా ఆడుతోంది. తొలి నాలుగు ఓవర్లల్లో 30 పరుగులు చేసింది. 7.50 రన్ రేట్‌తో స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉన్నారు. భారీగా పరుగులను రాబట్టుకుంటోన్నారు.

IND vs AUS final, World Cup 2023: Tweet war between BJP and Congress

ఈ మ్యాచ్ ఆధారంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములపై అంచనా వేసింది బీజేపీ. ఏ జట్టు గెలుస్తుందో తెలియజేస్తూ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో సింగిల్ లైన్ పోస్ట్ పెట్టింది. Come on Team India అని రాసుకొచ్చింది. We believe in you అంటూ ఈ ట్వీట్‌ను ముగించిందా పార్టీ ఎక్స్ హ్యాండిల్.

దీనికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. అది నిజం (True that) అంటూ అంగీకరించింది. ఫైనల్స్‌లో ఇండియా గెలుస్తుందంటూ బీజేపీ వేసిన అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవించింది. ఇండియా గెలుస్తుంది (Jeetega India) అని రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా ఈ రెండు పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధానికి తెర తీసినట్టయింది.

బీజేపీ చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావడానికి కారణం లేకపోలేదు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియాగా ఏర్పాటైన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్నారు. బీజేపీ నోట నుంచి ఇండియా గెలవాలనే మాట రావడం పట్ల దాన్ని ఈ రకంగా స్వాగతించింది కాంగ్రెస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+